మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!

నేటి ఆధునిక కాలంలో ఎందరో మహిళలు సంతాన లేమితో( childlessness ) బాధపడుతున్నారు.ఒకప్పుడు ఆడ‌వారు అర డజన్, డజన్ మంది పిల్లల్ని కనేవారు.

కానీ ఇప్పటి రోజుల్లో కనీసం ఒక్కరిని కనే అదృష్టం కూడా కొందరికి ఉండటం లేదు.గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉండడం, అండాశయ సమస్యలు, ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబ్‌లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, అనారోగ్యకర జీవనశైలి, ధూమ‌పానం, మద్యం తాగడం, అధిక బరువు లేదా తక్కువ బరువు తదితర కారణాల వల్ల మహిళల్లో సంతాన సమస్యలు తలెత్తుతాయి.

అయితే వీటికి చెక్ పెట్టడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా తోడ్పడతాయి.మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి.

మరి అటువంటి సూపర్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.అంజీర్( fig ).ఆడవారి ఆరోగ్యానికి వరమ‌ని చెప్పుకోవచ్చు.అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి.

Advertisement

ఇవి సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి సహాయపడతాయి.అంజీర్‌లోని యాంటీఆక్సిడెంట్లు హార్మోన్ల అసమతుల్యత మరియు రుతుక్రమం స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

ఆడవారిలో సంతాన సమస్యలను దూరం చేసే సూపర్ ఫుడ్స్ లో దానిమ్మ( Pomegranate ) ఒకటి.దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యకరమైన గర్భాశయ లైనింగ్‌ను ప్రోత్సహించడంలో తోడ్ప‌డ‌తాయి.పైగా దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్‌తో సహా ఈస్ట్రోజెన్-ఆధారిత క్యాన్సర్‌లను నిరోధించడంలో మరియు పోరాడడంలో సహాయపడతాయి.

ఆడవారిలో ఫెర్టిలిటీ రేటు పెంచడానికి బీన్స్ కూడా హెల్ప్ చేస్తాయి.బీన్స్( beans ) లో ఉండే పోషకాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి.సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి.

అలాగే జీడిపప్పును స‌రైన మోతాదులో తింటే మహిళల్లో సంతాన సామర్థ్యం పెరుగుతుంది.జీడిపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్లను నియంత్రించగ‌ల‌వు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఇక ఇవే కాకుండా ముదురు ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, గుడ్డు, సాల్మన్ చేప‌లు, డ్రాగన్ ఫ్రూట్, కివి, పాలు, పెరుగు వంటి ఫుడ్స్ కూడా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు సంతానోత్పత్తిని పెంచడానికి తోడ్ప‌డ‌తాయి.

Advertisement

తాజా వార్తలు