బుల్లితెరలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోల కంటే రియాలిటీ షోలకు మంచి క్రేజ్ ఉంది.అందులో ముఖ్యంగా బిగ్ బాస్.
ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
సీజన్ ప్రారంభం నుండి చివరి వరకు ఇంకా ఆసక్తిగా చూస్తుంటారు.నిజానికి ఈ షో చూడడానికి కారణం సెలబ్రిటీలు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారో.
వాళ్ల గురించి తెలుసుకోవాలనే ఆరాటపడుతుంటారు.
ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో సీజన్ 5 తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో కోవిడ్ కారణంగా బిగ్ బాస్ షో వాయిదా పడింది.ఇక ప్రస్తుతం అనుకూలంగా ఉండటంతో ఈ షో ను తిరిగి ప్రారంభించడానికి స్టార్ మా యాజమాన్యం ప్లాన్ చేసింది.
ఇక ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో.ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎవరా అని తెగ ఆరాటపడుతున్నారు.

ఇప్పటికే ఈ సీజన్ కోసం వెండితెర, బుల్లితెర నటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొనున్నట్లు సమాచారం.ఇక తాజాగా సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొంటారు అన్నట్లు స్టార్ మా ఓ సాక్ష్యాన్ని బయటపెట్టింది.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న మ్యూజిక్ షో గురించి అందరికీ తెలిసిందే.దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో పాల్గొన్న వాళ్లంతా సోషల్ మీడియా సెలబ్రిటీలే.
ఇందులో షణ్ముఖ్ జస్వంత్, ఇటీవలే విడుదలైన 30వెడ్స్21 వెబ్ సిరీస్ నటులు తప్ప మిగిలిన వారు గుర్తు కట్టడం కష్టం.ఇప్పటికే షణ్ముఖ్ సీజన్ ఫైవ్ లో పాల్గొనున్నట్లు తెలిసింది.
అంతేకాకుండా హనుమంత్ పేరు కూడా వినిపిస్తుంది.అయితే తాజాగా ఈ ప్రోమో లో కనిపించే వాళ్లే సీజన్ 5 లో అడుగుపెడుతున్నటు తెలుస్తుంది.
అంటే ఇందులో పాల్గొన్న ఆరుగురిలో నలుగురైనా పాల్గొంటారన్న అవకాశం ఉంది.ఇక ఈ ప్రోమోలో వీళ్లు చేసిన సందడి మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.