కసితో సినిమాలు తీసి హిట్లు సాధిస్తున్న ఫ్లాప్ డైరెక్టర్లు.. వాళ్లు మాత్రం వేస్ట్ అంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరెక్టర్లను చులకనగా చూస్తారనే సంగతి తెలిసిందే.

ఫ్లాప్ డైరెక్టర్ ఎంత మంచి కథ చెప్పినా ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు కానీ హీరోలు కానీ ఇష్టపడరు.

ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తే తమ ఖాతాలో కూడా ఫ్లాప్ చేరుతుందని భయపడే వాళ్లు ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉన్నారు.అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా తర్వాత సినిమాతో సత్తా చాటి ప్రూవ్ చేసుకుంటున్నారు.

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా అనుదీప్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

అనుదీప్ మరో ఛాన్స్ రావడంతో జాతిరత్నాలు సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు.పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

సినిమాలో గొప్ప కథ లేకపోయినా కథనంతోనే అనుదీప్ మ్యాజిక్ చేశారు.

జాతిరత్నాలు మూవీ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.ఈ సినిమా సక్సెస్ తో అనుదీప్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.క్లాస్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హను రాఘవపూడి గత సినిమా పడిపడి లేచే మనసు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే సీతారామం సినిమాతో ఈ దర్శకుడు కూడా ప్రూవ్ చేసుకున్నారు.చందూ మొండేటి దర్శకత్వం వహించి థియేటర్లలో విడుదలైన సవ్యసాచి డిజాస్టర్ గా నిలిచిందనే సంగతితెలిసిందే.అయితే ఈ దర్శకుడు కూడా కార్తికేయ2 సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

అయితే మరి కొందరు కొత్త దర్శకులకు స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు ఛాన్స్ ఇస్తున్నా ఆ దర్శకులు రొటీన్ సినిమాలు తీసి తొలి సినిమాకే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతుండటం గమనార్హం.కసితో సినిమాలు తీస్తున్న ఫ్లాప్ డైరెక్టర్లు సక్సెస్ ట్రాక్ లోకి వస్తుంటే కొందరు డైరెక్టర్లు మాత్రం వేస్ట్ అనిపించుకుంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు