ఖాళీ కడుపున ఇవి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు త్వ‌ర‌గా క‌రుగుతాయ‌ట‌..తెలుసా?

కిడ్నీ స్టోన్స్ లేదా మూత్ర‌పిండాల్లో రాళ్లు.ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిలో క‌నిస్తున్న స‌మ‌స్య ఇది.

ఊబకాయం, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, డీహైడ్రేష‌న్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి.కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ కిడ్నీల్లో ఏర్ప‌డిన రాళ్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే పానియాల‌ను ఉద‌యాన్నే ఖాళీ క‌డుపున తీసుకుంటే గ‌నుక ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.మ‌రి లేటెందుకు ఆ పానియాలు ఏంటో చూసేయండి.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో రెండు స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ మిక్స్ చేసుకోవాలి.అపై ఈ పానియాన్ని ఉద‌యం బ్రెష్ చేసుకున్న వెంట‌నే ఖాళీ క‌డుపున‌ సేవించాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే గ‌నుక మూత్ర పిండాల్లో ఏర్ప‌డిన రాళ్లు క్ర‌మ‌క్ర‌మంగా క‌రిగిపోతాయి.

Advertisement

పైగా ఈ పానియం తీసుకోవ‌డం వ‌ల్ల ఒంట్లో కొవ్వు కూడా క‌రుగుతుంది.అలాగే గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పుచ్చ గింజ‌ల పొడి మ‌రియు అర స్పూన్ యాల‌కుల పొడి వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని సేవించాలి.ఇలా రోజూ చేసినా కిడ్నీల్లో రాళ్లు త‌గ్గుతూ వ‌స్తాయి.

కొబ్బ‌రి నీళ్లు సైతం మూత్ర పిండాల్లో ఏర్ప‌డిన రాళ్ల‌ను క‌రిగించ‌గ‌ల‌వు.ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీటిలో ఒక స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసుకుని సేవించాలి.ఇలా రోజూ చేస్తే కిడ్నీల్లో రాళ్లు త‌గ్గ‌డంతో పాటు డీహైడ్రేష‌న్ స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు చర్మం య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు