ప్రాణాంతకరమైన బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇవే..! వెంటనే గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు..

లుకేమియా, దీన్నే బ్లడ్ క్యాన్సర్( Blood cancer ) అని కూడా పిలుస్తారు.

అలాగే ఎముక మజ్జ, శోషరస వ్యవస్థతో సహా శరీరంలోని రక్తంలో ఏర్పడే కణజలాల క్యాన్సర్.

దీనికి ఎన్నో అనేక రూపాలు ఉన్నాయి.ఇందులో అత్యంత సాధారణ రకం తీవ్రమైన లింఫోసైటిక్ లుకేమియా.

అయితే ఈ మధ్యకాలంలో బ్లడ్ క్యాన్సర్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. లుకేమియా( Leukemia ) సాధారణంగా తెల్ల రక్త కణాలు పని చేయకపోవడానికి కలిగి ఉంటుంది.

అయితే ఇన్ఫెక్షన్ ని పోరాడేందుకు తెల్ల రక్త కణాలు శక్తివంతంగా పనిచేస్తాయి.అవి సాధారణంగా పెరుగుతాయి.

Advertisement

శరీరానికి అవసరమైన విధంగా మారుతాయి.

కానీ లుకేమియా ఉన్న రోగులలో మాత్రమే ఎముక మజ్జలో అధిక మొత్తంలో తెల్ల రక్త కణాలను( White blood cells ) ఉత్పత్తి చేస్తుంది.అయితే అవి సరిగ్గా శరీరానికి పనిచేయవు.అందుకే ఇది తీవ్రంగా మారి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.

అందుకే వెంటనే క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది.అయితే లుకేమియా లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచుగా తీవ్రమైన ఇన్ఫెక్షన్, అలాగే యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగా లేకపోవడం జరుగుతుంది.అంతేకాకుండా తరచుగా జ్వరంగా కూడా అనిపిస్తుంది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

ఇక అంతేకాకుండా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మైకం, బలహీనత, అలసటగా కూడా అనిపిస్తుంది.

Advertisement

శోషరస గ్రంథులు ఉబ్బినట్లయితే కూడా అది క్యాన్సర్ లక్షణంగానే పరిగణించాలి.ప్లీహం లేదా కాలేయం పెరగడం వలన కూడా లుకేమియా ప్రమాదకరంగా మారుతుంది అంతేకాకుండా ఆకస్మిక గాయాలు, చర్మంలో చిన్న ఎర్రటి మచ్చలు కనిపించడం, అలాగే ముక్కు నుండి రక్త స్రావం జరగడం లాంటివి రక్త క్యాన్సర్ కు సంకేతాలు.అలాగే అకస్మాత్తుగా అధిక బరువు కోల్పోవడం, బరువులో మార్పు వస్తే మాత్రం వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ ఎంకాలజిస్ట్( Pediatric Oncologist ) ద్వారా బ్లడ్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.ఇలా వెంటనే తెలుసుకుంటే చికిత్సకు 95 శాతానికి పైగా చికిత్స స్పందిస్తుంది.

దీన్ని చాలా వరకు నయం చేయవచ్చు.

తాజా వార్తలు