చేపలను తినమని వైద్యులు అదేపనిగా చెప్పడానికి గల కారణాలు ఇవే..!

నాన్ వెజ్ ప్రియుల్లో కొంతమంది చేపలను తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.సాధారణంగా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలామంది ప్రజలకు తెలుసు.

అంతేకాకుండా చేపలు తినడం వల్ల మంచి పౌష్టికా ఆహారం తీసుకున్నట్లు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా సాల్మన్,( Salmon Fish ) ట్రౌట్, మాకెరెల్, సార్డినెస్ మధ్య చేపలు ఎక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి.

వీటిని తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోకి త్వరగా చేరుతాయి.

చేపలు ఎందుకు తినాలో, వాటిని తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు( Omega-3 ) మనిషి శరీర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇవి చాలా తక్కువ ఆహార పదార్థాలలో లభిస్తాయి.

Advertisement

ఇవి మానవ మెదడు, కంటిచూపులు మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.మనిషి మెదడులో ఎక్కువ భాగం బాల్యంలోనే అభివృద్ధి చెందుతుంది.

వృద్ధాప్యం చేరువుతున్న కొద్ది దాని పనితీరు బలహీనపడుతూ వస్తుంది.అలాగే పిల్లలు ముసలివారే ముఖ్యంగా చేపలను ఎక్కువగా తినాలి.

ఇందులో పోషకాలు మెదడుకు ఎంతగానో ఉపయోగపడతాయి.చేపలలో ఉండే పోషకాహారం మెదడు శక్తిని పనితీరును మెరుగుపరుస్తుంది.చేపలలో మన కండరాలకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

అలాగే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్లు ఎంతో అవసరం.చేపల్లో ఉండే ప్రోటీన్ ఎంతో బలాన్ని ఇస్తుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

ఆధునిక కాలంలో కంప్యూటర్ స్క్రీన్ లను, మొబైల్లను చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.ఇది కంటిచూపు పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

Advertisement

చేపలు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.గుండె కండరాలకు చేపలు ఎంతగానో మేలు చేస్తాయి.

ఆ కండరాలు బలహీనమైనప్పుడు గుండెపోటు( Heart attack ) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.గుండెకు మేలు చేసే పిఎఫ్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలలో ఎక్కువగా ఉన్నాయి.ఇవి గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి.

అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇవి జుట్టు మెరిసేలా, దృఢంగా ఉండేలా చేస్తాయి.

అందుకోసమే వైద్యులు అదేపనిగా చేపలను వారానికి రెండుసార్లు అయినా తినమని చెబుతూ ఉంటారు.

తాజా వార్తలు