ఇండస్ట్రీ లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి…వాటిలో కొన్ని సినిమాలు మాత్రం మనం చాలా సార్లు చూడాలి అనుకుంటాం ఇక లాంటి వాళ్ల కొసమే ఈ మధ్యకాలంలో థియేటర్లలో నేరుగా సినిమాను మళ్ళీ రిలీజ్ చేసి అభిమానులు తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటున్న విషయం తెలిసిందే…ఈ క్రమంలోనే తాజాగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు సినిమాలను విడుదల చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నారు.మరి ఇప్పటికే పోకిరి, గ్యాంగ్ లీడర్, జల్సా , బిల్లా , ఖుషి , చెన్నకేశవరెడ్డి, సింహాద్రి , తొలిప్రేమ వంటి సినిమాలను రీ రిలీజ్ చేయగా అవి రిలీజ్ లో కూడా మంచి వసూలు సాధించి రికార్డు సృష్టించాయి.మరి దీన్ని బట్టి చూస్తే రీ రిలీజ్ లో సత్తా చాటిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం…
ఖుషి:

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) హీరోగా, భూమిక హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా రీ రిలీజ్ లో సత్తా చాటింది.ఏకంగా రూ.7.4 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది…
సింహాద్రి:
ఎన్టీఆర్, రాజమౌళి , భూమిక కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి( Simhadri ) సినిమా రీ రిలీజ్ లో రూ.4.60 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది…
ఈ నగరానికి ఏమైంది?:

విశ్వక్ సేన్(Vishwak Sen ) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రీ రిలీజ్ లో రూ.3.40 కోట్ల గ్రాస్ వసూళ్ల తో టాప్ 3 లో నిలిచి రికార్డు సృష్టించింది.
ఆరెంజ్:

రామ్ చరణ్ , జెనీలియా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మొదట్లో డిజాస్టర్ అయినప్పటికీ రీ రిలీజ్ లో రూ.3.36 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది.
జల్సా:
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా రూ .3.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఇక వీటితోపాటు ఒక్కడు రూ.2.54 కోట్లు, పోకిరి రూ.1.73 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించాయి…ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు రీ రిలీజ్ చేయడానికి రెఢీ గా ఉన్నారు…
.