ఎలక్ట్రిక్ కార్ కొనే ఆలోచనలో ఉన్నారా.. బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల వల్ల మధ్యతరగతి వాహనదారులకు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా విపరీతంగా పెరుగుతోంది.

వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కార్ల తయారీ కంపెనీలు సామాన్యులకు అందుబాటు ధరలకే ఎలక్ట్రిక్ కారులను( Electric Cars ) రిలీజ్ చేస్తున్నాయి.

ప్రతిరోజు మార్కెట్లోకి ఏదో ఒక ఎలక్ట్రిక్ కారు విడుదల అవుతూ ఉండడంతో ఏ ఎలక్ట్రిక్ కారు ను కొనాలో తెలియక కొనుగోలుదారులు కాస్త అయోమయంలో ఉన్నారు.మనం సామాన్యులకు అందుబాటు ధరలలో ఉండే ఎలక్ట్రిక్ కార్లు ఏవో.ఆ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు:

భారతదేశంలో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్( MG Comet ) ఇదే.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.7.98 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు:

భారతదేశంలో తక్కువ బడ్జెట్లో ఎంజీ కామెట్ తరువాత బెస్ట్ ఎలక్ట్రిక్ కార్( Tata Tiago EV ) ఇదే.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.8.69 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 310 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

Advertisement

సిట్రోయెన్ EC3 ఎలక్ట్రిక్ కారు:

భారతదేశంలో తక్కువ బడ్జెట్లో దొరికే బెస్ట్ కార్లలో( Citreon EC3 ) ఇది కూడా ఒకటి.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.11.50 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టాటా ఎలక్ట్రిక్ సెడాన్ కారు టిగోర్:

ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు:

ఈ కారు( Tata Nexon EV ) ఎక్స్ షోరూం ధర రూ.14.49 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు