బలహీనంగా ఉన్నవారు ఈ ఐదు రకాల పండ్లు తింటే ఇక మీకు తిరుగే ఉండదు!

సాధారణంగా కొందరు చాలా బలహీనం( Weakness )గా ఉంటారు.ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

శరీర బలహీనత కారణంగా తరచూ కళ్ళు తిరగడం, నీరసం, విపరీతమైన బద్ధకం వంటివి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.ఈ క్రమంలోనే బలహీనత తగ్గడానికి మందులు వాడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల పండ్లు అద్భుతంగా తోడ్పడతాయి.

ఈ ఐదు రకాల పండ్లను డైట్ లో చేర్చుకుంటే ఇక మీకు తిరుగే ఉండదు.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన పండు సీతాఫలం.

Advertisement

చలికాలంలో దొరికే ఈ పండు చాలా రుచిగా ఉంటుంది.బోలెడన్ని పోషకాలు సైతం కలిగి ఉంటుంది.

నిత్యం ఒక సీతాఫలం తింటే అందులో ఉండే ప్రోటీన్ మరియు క్యాలరీలు మీ శక్తిని పెంచుతాయి.బలహీనతను తరిమి తరిమి కొడతాయి.

అలాగే బలహీనంగా ఉన్నవారు తీసుకోవాల్సిన మరొక పండు పనస పండు( Jackfruit ) రోజుకు ఒక కప్పు పనస తొన్నలు తీసుకుంటే హెల్త్ కు చాలా మేలు జరుగుతుంది.పనస తొన్నలు బాడీని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.నీరసం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

బలహీనతను దూరం చేసే పండ్లలో సపోటా ఒకటి.ఈ ఫ్రూట్ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

రోజుకు రెండు అంటే రెండు సపోటా పండ్లను తింటే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

Advertisement

బోన్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

బలహీనతను దూరం చేసి మంచి శక్తిని ఇవ్వడానికి అరటి పండు కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.రోజుకు ఒక అరటిపండు( Banana )ను తీసుకుంటే అందులో ఉండే క్యాలరీలు బలాన్ని పెంచుతాయి.బద్దకాన్ని దూరం చేస్తాయి.

ఇక బలహీనంగా ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన మరొక పండు ఖర్జూరం.రోజుకో 4 లేదా 5 ఖర్జూరం పండ్లను తింటే ఎలాంటి బలహీనత అయినా సరే దెబ్బకు పరారవుతుంది.

తాజా వార్తలు