మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన పాక్ మంత్రి

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పాక్ మంత్రి షేక్ రషీద్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసే మరోసారి వార్తల్లో నిలిచారు.

నోటికి ఎలా వస్తే ఆలా మాట్లాడుతూ నిత్యం వివాదంలో చిక్కుకుంటున్నారు.

తాజాగా ఆయన భారత్ ను వివాదాస్పద రీతిలో హెచ్చరించే ప్రయత్నం చేశారు.ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే భారతప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని దాయాది దేశం పాక్ తన ఇష్టమైన తీరులో ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా పాక్ మంత్రి షేక్ రషీద్ భారత్ తో జరిగేది ఇక అణు యుద్ధమే అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు.

భారత్‌తో ఇక మిలిటరీ యుద్ధం ఉండదని,అణుయుద్ధమే అంటూ వ్యాఖ్యలు చేశారు.తమ వద్ద అణు వార్ హెడ్లు కలిగిన మిసైల్స్ ఉన్నాయని అవి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవని అన్నారు.

Advertisement

అయితే రషీద్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ పాకిస్థాన్ ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించలేదు.కాగా రషీద్ గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు పలు సార్లు చేసి వార్తల్లో నిలిచారు.

ఈసారి ఏకంగా భారత్ తో అణు యుద్ధమే అని అక్టోబరులో భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

  ఆయన తరచూ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారు.ఇదిలావుండగా, పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది.యుద్ధ ట్యాంకులను కూడా సరిహద్దులకు తరలించడమే కాకుండా సైనికుల సంఖ్యను పెంచుతోంది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు