ఆ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న ఫిలిమ్ ఛాంబర్..కారణం?

సినిమాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేవాళ్లే ఉంటారు.ఇక తమ అభిమాన హీరో నటించాడని తెలిస్తే ఇక ఆ సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూస్తుంటారు ప్రేక్షకాభిమానులు.

ముఖ్యంగా ఓ సినిమా చేస్తున్నారనే ప్రకటన వస్తే చాలు.ఇక ఆ సినిమా పేరు గురించి, టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తుంటారు సినీ అభిమానులు.

కానీ తాజాగా ఫిలిం ఛాంబర్ సినిమా పేరు ప్రకటించడం లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రతి సినిమా యొక్క నిర్మాణ సంస్థ తమ సినిమా టైటిళ్లను రిజిస్టర్ చేయిస్తారు.

ఇక ఆ సంస్థ తమ సంస్థతో నిర్మించబోయే సినిమాల పేర్ల వివరాలను ఫిలిం ఛాంబర్ కు ఇస్తుంది.ఇక ఫిలిం ఛాంబర్ ప్రతి నెలా ఓ లిస్ట్ లా సినిమా పేర్లను వెల్లడిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక దీని వల్ల ప్రొడక్షన్ హౌస్ లో వచ్చే సినిమా పేర్లన్ని బయటకు వస్తున్నాయి.

ఇక ఆ సినిమా పేరును బట్టి అందులో ఏ హీరో నటిస్తున్నాడని అభిమానులు చాలా సులువుగా కనిపెడుతున్నారు.దీనివల్ల సినిమా పేర్లు విడుదల చేసే సరికి అంత ఉత్సాహం కనపడకపోయేసరికి తాజాగా ఫిలిం ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకుంది.ప్రతి నెల సిని జాబితా విడుదలను ఇకపై విడుదల చేయడానికి ఆపివేయాలని నిర్ణయించారట.

ఇక ఈ నిర్ణయంపై కొందరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఫిలిం ఛాంబర్ నుండి వచ్చే లిస్టు ను ఆపిన.

పుకార్లు, లీకుల బెడద నుంచి సినిమా వివరాలు తెలుస్తుంటాయని, సినీ బృందం నుండి తమ సినిమా టైటిల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అంటూ వాళ్లలో ఒకరు విడుదల చేస్తారని అంటున్నారు.మరి ఇలాంటివి ఎలా ఆపగలరు అని ఫిలిం ఛాంబర్ ను ప్రశ్నిస్తున్నారు మరికొందరు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు