వీపీఎన్‌ అంటే ఏంటి? త్వరలో ఎందుకు బ్యాన్‌ కానున్నాయో తెలుసా?

వీపీఎన్‌. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌.

అయితే, ఎందుకు కొన్ని రోజులుగా వీటిపై వివాదం రాజుకుంటుందో తెలుసా? చాలా కాలంగా వీపీఎన్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ఉపయోగిస్తున్నారు.

దీంతో ఇంటర్నెట్‌లో ఫైళ్లను సురక్షితంగా కమ్యూనికేట్‌ చేయడానికి, ఫైళ్లను బదిలీ చేయడానికి వీపీఎన్‌లు ఎంతో ఉపయోగపడతాయి.

ఇవి హ్యాకర్ల నుంచి తమ నెట్‌వర్క్, డిజిటల్‌ ప్రాపర్టీని భద్రపరుచుకోవడానికి మన దేశంలో అనేక కంపెనీలు వాడుతున్నాయి.అయితే, సున్నితమైన ఫైళ్లను రిమోట్‌ కొలాబొరేషన్‌ సహకారంతో ప్రారంభించడానికి వీపీఎన్‌లు సమర్థవంతంగా తమ ఎంటర్‌ప్రైజ్‌ టూల్స్‌గా ఉన్నప్పటికీ, ఇవి పబ్లిక్‌లో ఎన్నోసార్లు వివాదాస్పద పరిశీలనలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజాగా మీడియానామా నివేదిక ప్రకారం మన దేశంలో వీపీఎన్‌ సేవలను నిషేధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కోరుతోంది.వీపీఎన్‌ ప్రవేట్‌ నెట్‌వర్క్‌ సేవలు సైబర్‌ బెదిరింపులకు, ఇతర కార్యకలాపాలకు ఎదుర్కోవడనికి ఇవి ముప్పుగా మారతాయని కమిటీ పెర్కొన్నట్లు సమాచారం.

Advertisement

కమిటీ వివరాల ప్రకారం.వీపీఎన్‌ యాప్‌లు, సా«ధనాలు ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులో ఉంటాయి.

దీంతో ఇవి సైబర్‌ నేరగాళ్లకు కూడా అనుమతినిస్తాయి.మీడియా నామా వివరాల ప్రకారం స్టాండింగ్‌ కమిటీలో వీపీన్‌ సేవలను, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రోవైడర్ల ద్వారా దేశవ్యాప్తంగా పర్మనెంట్‌గా బ్లాక్‌ చేయాలని సూచించింది.

నిఘా, ట్రాకింగ్‌ యంత్రాంగాన్ని మరింత పటిష్టంగా బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవాలని కమిటీ కోరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.కానీ, వీపీఎన్‌ సేవలను వాశ్వతంగా ఎందుకు బ్యాన్‌ చేస్తున్నారో అనే కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకునే ముందు, ఇవి మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

వీపీఎన్‌ సేవలతో ప్రయోజనాలు.

వీపీఎన్‌ సేవలు చాలా ఉపయోగకరమైనవి, నమ్మశక్యమైన సాధనం.అన్ని ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 30 శాతం కనీసం నెలకు ఒకసారి ఉపయోగిస్తున్నట్లు ఫోర్బ్స్‌ నివేదిక తెలిపింది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
పరీక్షకు నిమిషాల ముందు షాక్.. హాల్ టికెట్ తన్నుకుపోయిన గద్ద.. చివరి క్షణంలో ఏమైందంటే..?

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీలు వారి నెట్‌వర్క్, డిజిటల్‌ ప్రాపర్టీ హ్యాకర్ల నుంచి భద్రపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు.ఈ వీపీఎన్‌ టూల్స్‌ లాక్‌ డౌన్‌ సమయంలో ఎంతో ఉపయోగపడ్డాయి.

Advertisement

వర్క్‌ ఫ్రం హోం చేసేటపుడు భద్రత లేని తమ ఇంటర్నెట్‌ కనెక్షన్‌కు ఇవి ఉపకరించాయి.

ఈ సేవలతో ఇంటర్నెట్‌ యూజర్లు భారత్‌లో బ్లాక్‌ అయిన కంటెంట్‌ను కూడా యాక్సెస్‌ చేసే అవకాశం కల్పిస్తోంది.వీపీఎన్‌ టూల్స్‌ మీ ఐపీ అడ్రస్‌ మాదిరిగా కనిపించేది.మీ ట్రాఫిక్‌ను మాస్క్‌ చేసి, వేరే లొకేషన్‌ను చూపిస్తుంది.

పెరుగుతున్న సైబర్‌ దాడులకు వీపీఎన్‌ సేవలు అతిపెద్ద ప్రయోజనకరంగా ఉండేది.ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ ఎంతో ఉపయోగపడేవి.చాలా మంది వీపీఎన్‌లు ఆన్‌లైన్‌ కార్యాచరణను ట్రాక్‌ చేసేవారి నుంచి సురక్షితంగా రక్షిస్తుంది.256– బిట్‌ ప్రామాణిక ఏఈఎస్‌ అందిస్తాయి.ముఖ్యంగా ఆర్థిక లావాదేవిల సమయంలో సున్నితమైన అంశాలు దొంగిలింకుండా అడ్డుపడతాయి.

ఎందుకు బ్యాన్‌ చేస్తున్నారంటే.

వీపీఎన్‌ సాధనాన్ని ఉపయోగించడంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించినవి తరచూ తప్పుగా అర్థమవుతున్నాయి.వీపీఎన్‌ సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎందుకంటే చాలా వెబ్‌సైట్‌లు వీటిని అందిస్తున్నాయి.వాటిని ప్రకటన చేస్తున్నాయి.

ఇవి డార్క్‌ వెబ్‌ సైబర్‌ సెక్యూరిటీ వాల్స్‌ను దాటవేసి, సైబర్‌ నేరగాళ్లకు ఆన్‌లైన్లో వారి పేరు తెలియకుండానే అనుమతిస్తాయి.మంచి పేరున్న వీపీఎన్‌లు వాడినా.

వర్చువల్‌ ప్రైవసీలోకి చొరబడకుండా పూర్తి సురక్షితంగా ఉండలేరు.

తాజా వార్తలు