ఆ స‌ముద్ర తీరంలో రెండు కిలోమీట‌ర్ల లోప‌ల‌కు వెళ్లిపోయిన నీరు.. ఏమైందంటే..

చెరువులు అయినా ఎండిపోతాయేమో గానీ స‌ముద్రాలు ఎక్క‌డైనా ఇంకిపోతాయా విన‌డానికే చాలా న‌మ్మ‌స‌క్యంగా లేదు క‌దూ అయితే ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న చూస్తే నిజ‌మే అని న‌మ్మాల్సిందే.

ప్ర‌స్తుతం బంగాళాఖాతంలో రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్ర‌వ‌హించే గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం అంరికీ తెలిసిందే.

కాగా దీన్నే అంతర్వేది బీచ్ అని కూడా పిలుస్తుంటారు.ఇక ఇది తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఏర్పాటు అయి ఉంద‌ని తెలిసిన విష‌య‌మే.

అయితే ఈ బీచ్‌లో ఇప్పుడు ఓ వింత ఘ‌ట‌న జ‌రిగింది.అదేంటంటే కొద్ది రోజులుగా అ అంతర్వేది బీచ్ ద‌గ్గ‌ర సముద్రపు నీరు ముందుకు వ‌చ్చి ప్రాంతాన్ని మొత్తం ఆవ‌హించేస్తోంది.

దీంతో అల‌లు కూడా ఎంతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ స్థానికంగా నివాసం ఉంటున్న జానాలను వ‌ణికిస్తున్నాయి.ఇక వీటిని చూస్తుంటే నిన్న ఒక్క సారిగా అలలు పోటెత్తి స‌ముద్రం నీరు మొత్తం ముందుకు చొచ్చుకుని రావ‌డాన్ని మ‌నం చూడొచ్చు.

Advertisement

ఇక ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఏం జ‌ర‌గుతుందో అని అంతా భ‌య‌ప‌డ్డ‌ప్ప‌టికీ కూడా ఇప్పుడు ఈరోజు ఒక్క సారిగా నీరు మొత్తం లోప‌ల‌కు చొచ్చుకుని పోవ‌డాన్ని మ‌నం చూడొచ్చు.

ఒకటి రెండు అడుగులు కాదండోయ్ ఏకంగా రెండు కిలోమీటర్ల మేర స‌ముద్ర‌పు నీరు వెనక్కి వెళ్లిపోవ‌డం ఇప్న‌పుడు సంచ‌లంన రేపుతోంది.ఈ ఒక్క చోట‌నే కాదండోయ్ చాలా చోట్ల తూర్పు తీరంలో ఈ విధంగానే స‌ముద్రాలు భ‌య‌పెడుతున్నాయి.అనుకోకుండా ముందుకు వ‌స్తున్నాయి.

లేదంటే అనూహ్యంగా వెన‌క్కు వెళ్లిపోతున్నాయి.దీంతో అస‌లు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది.

ఇక ఈ తీర ప్రాంతాల్లో నివ‌సించే గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.చూడాలి మ‌రి ఇంకా ముందు ఏం జ‌రుగుతుందో.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు