Vijay Devarakonda : “THE విజయ్ దేవరకొండ” అంటూ బ్రాండ్ గా మార్చేసుకున్న విజయ్.. ట్వీట్ వైరల్?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అభిమానులకు, యాంకర్ అనసూయ భరద్వాజ్ కు మధ్య THE వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ వివాదం ఎప్పుడో మొదలై ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది.

అనసూయ ఈ వివాదాన్ని ఏ ముహూర్తన మొదలుపెట్టిందో కానీ అది కాస్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిపోయింది.అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా సమయంలో విజయ్ దేవరకొండకు అనసూయకు మధ్య విభేదాలు తలెత్తగా అప్పటినుంచి విజయ్ పై అనసూయ సమయం దొరికినప్పుడల్లా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా సంచలన ట్వీట్ లు చేస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ఇటీవలే తాజాగా అనసూయ విజయ్ పేరు ముందు ఉన్న THE ని పాయింట్ అవుట్ చేస్తూ ఒక సంచలన ట్వీట్ చేయడంతో అది కాస్త మరో కాంట్రవర్సీకి దారితీసింది.దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.అసభ్య పదజాలంతో అనసూయను ఏకిపారేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వివాదం పై విజయ్ దేవరకొండ స్పందించలేదు కానీ THE ని బ్రాండ్ గా చేసేసుకున్నాడు.ఇప్పటివరకు విజయ్ దేవరకొండ పేరు నార్మల్గా ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు ముందు THE బ్రాండ్ వచ్చి చేరింది.

Advertisement

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్( Director Harish Shankar ) ఒక పోస్ట్ చేశారు.అందులో THE ని హైలెట్ గా చేస్తూ విజయ్ గురించి చెప్పుకొచ్చాడు.ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరూ THE ని హైలెట్ చేస్తూ విష్ చేస్తున్నారు.

దాంతో THE అనేది బ్రాండ్ గా మారిపోయింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఈ ట్వీట్ పై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రౌడీ హీరో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు