పాపం ఈ టీవీ నటిని వెంబడిస్తూ బండబూతులు తిట్టాడు.. కట్ చేస్తే?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు కొన్ని కొన్ని సార్లు కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి.

అవి ఏ రకంగా ఎదురైనా కూడా అవి మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది.

ఆ విషయాలు పోలీస్ వరకు కూడా చేరుతుంటాయి.ఏ రకంగా గొడవలు జరుగుతాయో కానీ చాలావరకు మాత్రం ఏదైనా లైంగిక విషయంలో కానీ లేదా ఆర్థిక విషయంలో కానీ ఇండస్ట్రీ వాళ్లకు గొడవలు జరుగుతుంటాయి.

కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయంలో కూడా గొడవలు జరిగే సందర్భం వస్తుంటాయి.నిజానికి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా తాము మరింత ఫేమస్ కావడానికి చిన్న గొడవను కాస్త పెద్దదిగా కూడా మారుస్తుంటారు.

దానివల్ల వారికి సింపతి వస్తుందని అనుకుంటారు.మరికొందరు మాత్రం ధైర్యంతో గొడవలను ఎదుర్కొని వాటిని అక్కడి వరకే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు.

Advertisement

అలా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎన్నో గొడవలు జరిగాయి.ఇదిలా ఉంటే కొన్ని కొన్ని సార్లు నడిరోడ్డుపై కూడా కొందరు వ్యక్తులతో తిట్టుల పురాణాలు కూడా ఎదుర్కొంటారు.

ఎందుకంటే వాళ్ళు రోడ్డుపై ప్రయాణించే పద్ధతి సరిగ్గా లేకపోయేసరికి ఇతరుల వాహనదారుల నుంచి కూడా ఎదుర్కోవలసి వస్తుంది.ఇదిలా ఉంటే గతంలో ఓ టీవీ నటిని వెంబడిస్తూ మరి బండ బూతులు తిట్టాడు ఓ వ్యక్తి.

ఇంతకీ ఆ టీవీ నటి ఎవరు.తనను తిట్టిన వ్యక్తి ఎవరు.అసలు తనను ఎందుకు తిట్టాడో తెలుసుకుందాం.

ప్రముఖ టీవీ నటి అలెఫియా కపాడియా. గతంలో ఈమె తన కారులో ధారవి ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ముత్తుస్వామి అనే కెమెరామెన్ తన కారుతో తనను వెంబడించాడని పైగా బండ బూతులు తిట్టాడని.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అతడు తన కారుతో తన కారుకు డాష్ ఇస్తూ డామేజ్ చేసినట్లు ముంబై షాహూ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ నటి.వెంటనే ఆమె తన సెల్ ఫోన్ లో తనను వేధిస్తున్న ముత్తు స్వామి ఫోటోను, అతడి కారు నెంబర్ ప్లేట్ ను ఫోటో దింపి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు ఆమె చేసిన ఫిర్యాదుతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ముత్తు స్వామిని అరెస్టు చేశారు.

Advertisement

ఇక ఈ కేసుకు సంబంధించిన విషయాలను పోలీసులు మీడియా ముందు కూడా బయట పెట్టారు.

టీవీ నటి అలేఫియాను కెమెరామెన్ ముత్తుస్వామి వెంబడించి వేధించాడని అందుకే అరెస్టు చేశామని తెలిపారు.అతడు ధారవి ప్రాంత నివాసి అని సినీ ఇండస్ట్రీలో కెమెరామెన్ గా పనిచేస్తున్నాడని తెలిపారు.ఇక అతడికి ఆమె ఎవరో అని కూడా తెలియదని దాంతో అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టామని ఇక తొమ్మిది వేల పూచీకత్తుపై బెయిల్ దొరికిందని తెలిపారు.

కానీ ముత్తుస్వామి మాత్రం తన వాదనను మరోలా వినిపించాడని తెలిసింది.అతడు ఆమెను వేధించాలేదని ట్రాఫిక్ లో ఆమె కారుకు తన కార్ సైడ్ అద్దం తగలడంతో రాసుకుపోయిందని ఈ విషయాన్ని ఆమెకు చెప్పాలని ప్రయత్నించడంతో ఆమె తనను బూతు మాటలతో తిట్టిందని తెలిపాడు.

తను కూడా ఆమెను నోరు అదుపులో ఉండమని తిట్టానని తెలిపాడు.అలా కొంచెం దూరం వెళ్ళాక తన కారు ఫోటోను, తనను తీసిందని తెలిపాడు.

తాజా వార్తలు