వైరల్.. వామ్మో ఈ మొక్కను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటామట..!

మనలో చాలా మందికి ప్రకృతి అంటే చాలా ఇష్టం.అందమైన చెట్ల మధ్య ప్రకృతిని చూస్తూ కొంతసేపు మనకు ఉన్న బాధలను మర్చిపోతాము.

ఇంట్లో ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా సరే మొక్కలు నాటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం.అప్పుడప్పుడు పార్కులకు వెళ్లి అక్కడ చెట్లు చూస్తూ కొద్దీ సేపు ఎంజాయ్ చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది.

మొక్కలు ఆక్సిజెన్ ఇచ్చి ప్రాణాలను కాపాడతాయని తెలుసు కానీ ఈ మొక్క మాత్రం అలా కాదు.దీనిని ముట్టుకుంటే అంతే సంగతులు ఈ మొక్క ఆకును తాకినా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటామట.

వినడానికి చాలా విచిత్రంగా ఉన్న ఇది మాత్రం నిజం.ఆ మొక్కను తాకితే భరించలేని నొప్పి కలుగుతుందట.

Advertisement

దీంతో ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య దాకా వెళ్తామట.ఇంతకీ ఆ మొక్క ఏమిటా అని ఆలోచిస్తున్నారా దాని పేరు గింపీ - గింపీఈ మొక్క ఆకులూ చూడడానికి అందంగా హార్ట్ షేప్ లో అచ్చం రావి ఆకులుగా ఉన్నాయి.

ఈ చెట్టు ఆకులూ టచ్ చేసిన కూడా ప్రాణాపాయమే అట.ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియని గిరిజనులు పూర్వం ఈ మొక్క శపిస్తుందని నమ్మేవారట.ఈ చెట్టు ఆకుల్లో సన్నటి ముళ్ళు ఉంటాయని.

అవి కంటికి కనిపించనంత చిన్నగా ఉండడం వల్ల ఆ ఆకులను ముట్టుకుంటే విపరీతమైన నొప్పి వస్తుంది ఆ ముళ్ళను బయటకు కూడా తియ్యలేమట.అవి తీస్తే కానీ నొప్పి నుండి ఉపశమనం కలుగదు.ఈ ముళ్లలో ఉండే విషం వల్ల అవి గుచ్చుకోగానే ఆ విషం ఒళ్ళంతా పాకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతామట.

అతి భయంకరమైన ఈ మొక్కలు ఎక్కువుగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయట.చూసారా ప్రకృతిలో ఉండే అన్ని మొక్కలు మంచివే అని అనుకోవడం చాలా తప్పు.వాటిల్లో ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉంటాయి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు