గుండుతో షాక్ ఇచ్చిన జానకి కలగనలేదు సీరియల్ నటి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెరపై ప్రసరమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి ప్రేక్షకధారణతో దూసుకెళ్తుంది.ఇక ఈ సీరియల్ లోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్ ఇంటి పక్కన అమ్మాయిలా కనిపిస్తుంది.తొలిసారిగా మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ప్రియాంక.

ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఇందులో ప్రియాంక నటించిన అమ్ములు పాత్ర మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తొస్తూ ఉంటుంది.

ఈ సీరియల్ లో తాను మూగ అమ్మాయిగా నటించి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ప్రియాంక జైన్.ఇక ప్రియాంక తన అందంతో కూడా బాగా ఆకట్టుకుంది.బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

Advertisement

అందులో గోలి సోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.ప్రస్తుతం తాను జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సీరియల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రియాంక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ షాక్ ఇస్తుంది.

నిజానికి తన గ్లామర్ ఫోటోలని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ప్రియాంక తనతో కలిసి మౌనరాగంలో నటించిన అంకిత్ అలియాస్ శివ కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో ఉంటున్నారు.ఇక వీరిద్దరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

అప్పుడప్పుడు ప్రియాంక శివ ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఏదైనా బుల్లితెర ఈవెంట్ లో కూడా ఇద్దరు కలిసి స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తుంటారు.ఇదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రియాంక కొన్ని మోటివేషనల్ స్టోరీస్ పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.అందులో ఇప్పటికి చాలా విషయాలు పంచుకుంది.

ఇక తాజాగా హెయిర్ కటింగ్ అంటూ థంబ్ నేల్ లో తన గుండుతో ఉన్నట్లు ఫోటో కూడా ఎడిట్ చేసి వీడియో షేర్ చేసుకుంది.ఇక వీడియో ఓపెన్ చేస్తే తన బాయ్ ఫ్రెండ్ తో స్టైల్ గా హెయిర్ కట్ చేయించుకొని చూపించింది.

కానీ తను ఎక్కడ గుండుగా ఉన్నట్లు కనిపించలేదు.దీంతో చాలామంది వ్యూస్ కోసం ఇలా కూడా చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ప్రియాంక జైన్ కు స్టార్ హీరో నాగార్జున సినిమాలో అవకాశం అందుకుందని గతంలో వార్తలు వినిపించాయి.అందులో ప్రియాంక నాగార్జునకు చెల్లెలి పాత్రలో నటించనున్నట్లు టాక్ కూడా వినిపించింది.

అంతేకాకుండా మరో రెండు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుందని తెలుస్తుంది.

తాజా వార్తలు