ఐదుగురు భారతీయులని చంపినందుకు – సంచలన తీర్పు..   The Sensational Court Order On Dubai Victims     2018-10-23   15:54:20  IST  Surya

చేసిన పాపం ఊరికే పోదు అంటారు అందుకేనేమో భారతీయులని చంపిన పాపానికి బహిరంగంగా ముగ్గురికి శిరచ్ఛేదం శిక్ష ని అమలు చేసింది సౌదీ ప్రభుత్వం..వివరాలలోకి వెళ్తే..2014లో ఒక సౌదీ అరేబియా రైతు తన వ్యవసాయ భూమిలో పైపుల కోసం తవ్వుతుండగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ముందు అవి జంతువులకి సంభందించినవి అనుకున్నారు కాని అస్థిపంజరం లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు..

అయితే అదే ప్రదేశంలో మరింతగా తవ్వి చూడగా అక్కడ మరింతగా తవ్వి చూడగా మరో నాలుగు అస్థిపంజరాలు బయటపడ్డాయి…వీటిలో కొన్ని అస్థిపంజరాలకి నోటికి టేపులు చుట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయి.

అస్థిపంజరాల సమీపంలో లభ్యమైన వీసా కార్డు(అఖమా) ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు.. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.

The Sensational Court Order On Dubai Victims-

ఇదిలాఉంటే అసలు వారందరూ ఎవరూ అంటే కూపీ లాగిన పోలీసులకి నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. తన కూతురు ని అదేవిధంగా మరో మహిళను వేధించినందుకు ఒక సౌదీ యజమాని వారిని చిత్రహింసలకు గురిచేసి సజీవంగా పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 25 మందిని పోలీసులు విచారించగా ముగ్గురిని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది…దాంతో సౌదీ నియమం ప్రకారం వారు ముగ్గురిని ఖతీఫ్‌ పట్టణంలో బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు.