అన్నివర్గాలకు అన్నుపట్టిన వైసీపీ పాలన!

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరైనా అధికారంలోకి రావచ్చు కానీ ప్రజల పేరు చెప్పి అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలి పెట్టడం అందరిని కలసి వేస్తుంది.

అను భవరాహిత్యం,రాజకీయ పరిణితి లోపించి అహంకారం,ప్రతీకారం,నియంతృత్వం వంటి అవ లక్షణాలు ప్రజలు ఇచ్చిన అపూర్వ అధికారాన్ని అభాసు పాలు చేశాయి.

జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి రావడం కొరకు పడిన ఆరాటం, ఆడిన అబద్దాలు దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయనాయడు ఆడలేదు.జనహితం లేని జగన్నాటకం ఆడి ఆంధ్రప్రదేశ్ ను 40 నెలల్లో అధోగతి పాలు చేశారు.

అభివృద్ది పధంలో దూసుకు పోతున్న రాష్ట్రం ఆగ మాగం అయింది.అందమైన,ఆకర్షణీయమైన అబద్దాలు నమ్మి నెత్తిన పెట్టుకొన్నఅన్ని వర్గాల ప్రజలకు అన్నుపట్టింది జగన్ రెడ్డి పరిపాలన.

అసమర్ధులకు అవకాశాలు అందివచ్చినా ఏమి చేయలేరని రుజువైంది.జగన్మోహన్ రెడ్డి తన 40 నెలల పరిపాలనలో ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోలేక వికృత నిర్ణయాలు,విధ్వంసం,వివాదాలతో పాలన సాగిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.

Advertisement

మళ్ళి అధికారం లోకి రావడం కొరకు అబద్దాలను అందంగా ఆకర్షణీయం గా చెప్పడం అద్భుతమమైన కళగా మార్చుకొన్నారు.నిజాలను అబద్దాలుగా,అబద్దాలను నిజాలుగా తల్ల కిందులు చెయ్యడం లో జగన్ రెడ్డికి ఎవ్వరూ సరిలేరు.

ఆయన నోరుతెరిస్తే అబద్దాలే జాలు వారుతాయి.ఈ దేశంలో అవశేష రూపాలు ప్రదర్శించడంలో జగన్ ను మించిన రాజకీయ నాయకుడు లేడు.తాను ఇచ్చిన హామీలు 95 శాతం హామీలు అమలు చేశామని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.95 శాతం కాదు కదా 9 శాతం కూడా హామీలు అమలు కాలేదు.ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అని అర్థించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి తన మూడున్నరేళ్ల పాలనలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పగలరా? తాను ఏం చేసినా పేద ప్రజల కోసమే అని నమ్మించడం కోసం అమాయక ప్రజల సైకాలజీని గుర్తించిన జగన్ రెడ్డి వంచనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.అబద్దాలతో ప్రజలను తన వైపునకు తిప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌, అధికారం అంటే బాధ్యత అనే విషయాన్ని విస్మరించారు.

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తన సొంత మీడియాలో గ్రాఫిక్స్‌ ద్వారా ఊదరగొడుతున్నారు,శాసనసభ లో సమస్యలు స్వోత్కర్షకాలకే పరిమితం చేశారు.తానూ అద్భుతాలు చేసినట్లు అంకెల గారడీలతో అబద్దాలు ఊదర గొడుతున్నారు.

దార్శనికత ఉన్న నాయకులు రాష్ర్టాన్నిఎలా అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తారో,దార్శనికత లేని వారి పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశే లో జగన్ రెడ్డి పరిపాలనే ఉదాహరణ.పరిపాలన అద్భుతం అయితే బటన్ నొక్కుడు బహిరంగ సభల్లో జగన్ రెడ్డి నోరు తెరవగానే జనం కొందరు గోడలు దూకి పారిపోవడం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ముఖ్యమంత్రి సభలకు తీసుకు వస్తున్న జనం మధ్యలో వెళ్లిపోకుండా పోలీసులను కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గడప లోపలే జగన్ రెడ్డి భోగమంతా కానీ గడప దాటితే ప్రజలు నిలదీస్తున్నారు.ఎందుకొచ్చారంటూ ఛీత్కరిస్తున్నారు.ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్మోహన్‌ రెడ్డి ఆ మంచి పనులు అంటే ఏమిటో చెప్పగలరా?మంచి పనులు చేస్తే ఎందుకు పరదాలు కట్టుకొని ప్రజల్లోకి పోవాల్సివస్తుంది?

Advertisement

గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న కంపెనీలు మినహా మీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కంపెనీ కానీ పరిశ్రమ అయినా ఒక్కటైనా ఉన్నదా? గత ప్రభుత్వ చేసిన కృషి వల్ల వచ్చిన ర్యాంకులను తమ ఖాతాలో వేసుకొవడం ఆత్మవంచన కాదా?మూడున్నరేళ్ళ పాలన చూసిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి జగన్‌ అర్హుడేనా అని ప్రజలు ప్రశ్నించుకొంటున్నారు.మీ మూర్ఖత్వ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్న వాస్తవాన్ని కాదనగలరా? ఒక పక్కన రాష్ట్రం అధోగతి పాలు అయిన అనర్థం కళ్లకు కడుతున్నా తప్పులను ఎత్తి చూపుతున్న,ప్రశ్నింస్తున్నవారిపై వికృతంగా విరుచుకుపడే సైకోలు రాష్ట్రమంతటా విస్తరించారు.ఈ విపరీతం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా విస్తరించడం మహా విషాదం అని చెప్పాలి.

రాష్ట్ర భవిష్యత్తు కంటే కుల, మతాలకు,ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చిరెచ్చగొట్టే తన మూకలను తయారు చేసుకోవడంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విజయం సాధించారు.మూడున్నరేళ్ళ తన పాలనను చూసి తానే మురిసిపోవడం చూస్తుంటే గురివింద తన అందాన్ని చూసి తానె గొప్పగా వర్ణించుకొన్నట్లు వుంది.

తాజా వార్తలు