ఏపీలో ఎప్పటి నుంచో బలపడాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తోంది.కానీ సొంతంగా బలం పెంచుకునే విషయంలో ఆ పార్టీ సరైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయలేకపోవడం , ఎప్పుడు ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకుని ఏపీలో ఎన్నికలకు వెళ్లి, ఒకటి అర సీట్లను సాధించడం మినహా పెద్దగా ఆ పార్టీ ప్రభావం ఏమి లేదు అన్నట్టుగా పరిస్థితి ఉండేది.2019 ఎన్నికల్లో ఏపీ లో బిజెపి ఒంటరిగా పోటీ చేసి అన్నిచోట్ల ఘోర పరాజయం చెందింది.ఆ తర్వాత జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది.
అయితే ఏపీ బీజేపీ మొదటి నుంచి టిడిపికి అనుకూలంగా ఉంటూ వచ్చేది.అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచి ఆ పరిస్థితి మారింది.వైసిపి కి అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ మద్దతు పలుకుతూ వచ్చారు.ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో ఆయన టిడిపికి అనుకూల వ్యక్తిగా ముద్ర వేయించుకోగా.
ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసిపి అనుకూల వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు.

అయితే 2024 ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగానే బిజెపి ముందుకు వెళ్ళబోతుండడం, ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదవి కాలం త్వరలోనే ముగిబోతుండడంతో పూర్తిగా వైసిపిని వ్యతిరేకించే వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్లాన్ లో బిజెపి అగ్ర నాయకులు ఉన్నారు.ఈ క్రమంలోనే కొత్తగా బిజెపి అధ్యక్షుడిని ఏపీలో నియమించాలని చూస్తున్నారు.ఈ మేరకు కొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత బిజెపి ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రాయలసీమ ప్రాంతానికి చెందిన సత్య కుమార్ ఆసక్తి చూపిస్తున్నారట.సత్య కుమార్ కు ఇటీవల ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం, అక్కడ ఆయన పనితీరు పై ప్రశంసలు రావడం , అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో నిపుణుడైన సత్య కుమార్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేస్తారని, ఏపీ బీజేపీని మరింత బలోపేతం చేస్తారని జగన్ పై విమర్శలు చేయడంలోనూ ఆయన ముందుంటారని బిజెపి అగ్ర నాయకులు భావిస్తున్నారట.
ప్రస్తుతం ఆయన ఓ పత్రికకు కాలస్ట్ గా పని చేస్తున్నారు.అయితే ఆయన టిడిపికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అనే అభిప్రాయాలు ఉన్న క్రమంలో బిజెపి అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది.







