అది నిజమైన సర్వేనా ... నిజాలు దాచిన సర్వేనా .. ?     2018-12-04   14:05:12  IST  Sai M

సర్వే ! ఓటర్ల నాడి తెలుసుకునేందుకు వివిధ సంస్థలు రకరకాల సర్వేలు చేస్తూ… ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ముందుగానే సూచనప్రాయంగా చెప్పేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సర్వే సంస్థలు నిస్పక్షపాతంగా … తమ సర్వే రిపోర్ట్ ను అందిస్తే… మరికొన్ని సంస్థలు మాత్రం తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్స్ ను ప్రకటిస్తుంటాయి. ఇక పార్టీలు కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంపై సర్వేలు చేయిస్తూనే ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో ఈ సర్వే లకు చాలా డిమాండ్ ఉంటుందికే కూడా. పోలింగ్ తేదీకి ముందు కొన్ని కొన్ని సర్వే లెక్కలు ఓటర్లను కూడా విపరీతంగా ప్రభావితం చేస్తుంటాయి. అందుకే కొన్ని కొన్ని పార్టీలు సర్వే సంస్థలతో లాలూచి పడి సర్వే రిపోర్ట్స్ తమకు అనుకూలంగా ఉన్నట్టు ప్రకటించేలా ముందుగానే ఒప్పందం చేసుకుంటూ ఉంటాయి.

The Reasons Behind TV Channels Survey On Telangana Elections-Lagadapati Rajagopal Mahakutami Telagana Elections TRS

తాజాగా తెలంగాణ లో 7 వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో… ఓ టీవీ ఛానెల్ తమ ఎన్నికల సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. అయితే ఆ సర్వేలో టీఆర్ఎస్ కి ఎక్కువ సంఖ్యలో సీట్లు రాబోతున్నట్టుగా ఆ సర్వే తేల్చినట్టు ఆ టీవీ కధనం ఉంది. అయితే… టీఆర్ఎస్ ప్రభుతం రద్దు చేసే సమయానికి పరిస్థితులన్నీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ… అయితే ఆ తరువాత వచ్చిన మార్పుల కారణంగా…

The Reasons Behind TV Channels Survey On Telangana Elections-Lagadapati Rajagopal Mahakutami Telagana Elections TRS

ఆ లెక్కల్లో తేడా వచ్చి ఇప్పుడు తెలంగాణాలో టఫ్ వార్ నడుస్తోంది. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడలేని అసహనం కలుగుతోంది. అందుకే… ఈ మధ్య లగడపాటి ఎన్నికల ఫలితాలు బయటకు పూర్తిగా చెప్పకుండానే టీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కి ఆయన పై ఫిర్యాదు చేసి, తమ భుజాలు తామే తడుముకున్నారు. అంటే అక్కడే అర్ధం అయిపోతుంది టీఆర్ఎస్ కి అనుకున్నంత స్థాయిలో అనుకూల పరిస్థితులు లేవని.

The Reasons Behind TV Channels Survey On Telangana Elections-Lagadapati Rajagopal Mahakutami Telagana Elections TRS

లగడపాటి సర్వేలో కూటమి పార్టీలకు మొత్తం 60కి పైగా సీట్లు వస్తే తాజాగా ఆ టీవీ ఛానెల్ చేయించిన సర్వేలో మాత్రం టీఆర్ఎస్ కు 49.7% ప్రజల మద్దతు ఉంది అని, ఆ క్రమంలోనే టీఆర్ఎస్ 94 నుంచి 104 సీట్లు వరకూ సాధించే అవకాశం ఉంది అని, ఇక కూటమి 25 లోపే సీట్లతో సరిపెట్టుకోవాలి అని లెక్క తేల్చింది. ఇక్కడే అందరికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఛానెల్ తో గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి విరోధం ఉండేది. కానీ అకస్మాత్తుగా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఆ ఛానెల్ లో టీఆర్ఎస్ అనుకూల కధనాలు రావడం… ఇప్పుడు పోలింగ్ తేదికి అతి దగ్గర్లో టీఆర్ఎస్ కి మెజార్టీ స్థానాలు ఉన్నాయని సర్వే రిపోర్ట్ ను ప్రకటించడం వెనుక ఏదో తెలియని రహస్యం ఉంది అనే భావనలో చాలామంది కనిపిస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.