ది రాజాసాబ్ మూవీ రిలీజయ్యేది అప్పుడేనా.. బాలయ్యకు భారీ షాక్ తప్పదా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ ఏడాది కన్నప్ప, ది రాజాసాబ్(the rajasaab) సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కన్నప్ప ఏప్రిల్ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ది రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ (Rajasaab movie release date)కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.సెప్టెంబర్ నెలలో ది రాజాసాబ్ విడుదల కానుందని భోగట్టా.

వాస్తవానికి సెప్టెంబర్ నెలలో ఇప్పటికే అఖండ2(Akhanda 2) సినిమా షెడ్యూల్ అయి ఉంది.బాలయ్య గత సినిమాలను మించి 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సెప్టెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెండు డేట్లను లాక్ చేశారని ఆ రెండు డేట్లలో ఏదో ఒక డేట్ కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని అయితే సీజీ పనులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది.

Advertisement
The Rajasaab Movie Release Date Fixed Details Inside Goes Viral In Social Media

ఈ సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ భవిష్యత్తును నిర్దేశించే సినిమా అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

వరుస విజయాలు సాధిస్తున్న ప్రభాస్ ది రాజాసాబ్(Prabhas the Rajasaab) సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాల్సి ఉంది.

The Rajasaab Movie Release Date Fixed Details Inside Goes Viral In Social Media

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని భవిష్యత్తు సినిమాలతో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ప్రభాస్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో ప్రభాస్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

నితిన్ విక్రమ్ కె కుమార్ కాంబో మూవీ అలా ఉండబోతుందా.. షాకింగ్ అప్ డేట్స్ ఇవే!
Advertisement

తాజా వార్తలు