టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో ప్రభాస్.
నేడు హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ ( Maruthi )లో వస్తున్న సినిమా పేరు రాజసాబ్ నుంచి ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.
పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోతో పాటు మోషన్ పోస్టును విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇందులో ప్రభాస్ సింహాసనం మీద ఒక చేతిలో సిగార్‌తో రాజులాగా కనిపించి అభిమానులలో మరింత ఆసక్తి పెంచాడు.ఈ సినిమా హర్రర్, కామెడీ( Horror, Comedy ) నేపథ్యంలో రూపొందుతున్నట్లు తెలుస్తుంది.ఇక వాస్తవానికి ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానుల్లో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల కాలంలోనే ప్రభాస్ పుట్టినరోజు నుంచి తరచు ఈ సినిమాపై అప్డేట్స్ ఉంటాయని నిర్మాత తెలియజేశారు.అంతేకాకుండా, ఇటీవల ప్రభాస్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా అది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అందులో గళ్ళ చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా నడుస్తున్నట్లు డిజైన్ చేశారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల అవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
ఇందులో ప్రభాస్ తో పాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఇంకొక అప్డేట్ ఏమిటంటే.ప్రభాస్ ఇందులో తాతా, మనవడు గెటప్స్ లేదా నాన్న, కొడుకు గెటప్స్ లలో రెండు పాత్రలలో ప్రేక్షకుల ముందుకు కనిపించబోతున్నట్లు సమాచారం.చూడాలి మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ ని ఏవిధంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడో.