విమానంలో సిబ్బంది ముఖంపై గుద్దిన ప్రయాణికుడు.. చివరికి కోలుకోలేని షాక్!

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి అర్జంట్ అవడంతో వాష్ రూమ్ కు వెళ్లాలని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగాడు.

అయితే ఫస్ట్ క్లాస్ బాత్రూమ్ ను వాడకూడదని, మరొక వాష్ రూమ్ లోకి వెళ్లాలని సిబ్బంది అతనికి చెప్పారు.

అతని సమాధానంతో ప్రయాణికుడికి కాస్త కోపం వచ్చింది.దాంతో సిబ్బంది తల భాగంలో కొట్టాడు.

దానికి సంబంధించిన దృశ్యాలను అందులోని కొందరు రికార్ట్ చేశారు.అనంతరం వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో వెంటనే వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ వ్యక్తి విమాన సిబ్బంది వద్దకు వెళ్లడాన్ని గమనించవచ్చు.

Advertisement

అనంతరం ఆ వ్యక్తి అతనిపై దాడి చేశాడు.క్యాబిన్ సిబ్బందిని కొట్టిన దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తర్వాత ఏమీ ఎరగనట్లు తన సీట్లోకి వెళ్లి కూర్చుంటాడు.విమానంలోని ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌లోని రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించకూడదని చెప్పడం పట్ల ప్రయాణీకుడు కోపంగా ఉన్నాడని తోటి ప్రయాణీకులు చెబుతున్నారు.

ఘటన జరిగినప్పటికీ.విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సురక్షితంగా ల్యాండ్ చేయడం విశేషం.

అయితే ఇలాంటి హింసాత్మక ప్రవర్తన వలన విమానంలోని ఇతర ప్రయాణికులు, సిబ్బంది అనవసరంగా ప్రమాదంలో పడే చాన్సు ఉందని విమానయాన సంస్థ ప్రతినిధి కర్టిస్ బ్లెస్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఆ వ్యక్తి ఇంకెప్పుడూ అమెరికన్ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఫస్ట్ క్లాస్ బాత్రూమ్‌ని ఉపయోగించడానికి అనుమతించలేదని ఆ ప్రయాణీకుడు విమాన సిబ్బందిపై ఇలా దాడి చేయడం అమానుషం అని అన్నారు.అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 377 లో మెక్సికోలోని శాన్ జోస్ డెల్ కాబో నుంచి లాస్ ఏంజిల్స్ కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు