Gopi chand t.krishna : గొప్పవాళ్ళ కడుపున గొప్పవాళ్ళే పుడతారు.. అందుకు ఉదాహరణ గోపీచంద్

టి.కృష్ణ తెలుగు దర్శకుడు గా మాత్రమే కాదు మహోన్నత వ్యక్తిత్వం గల‌ దర్శకుడు గా మంచి పేరును సంపాదించుకున్నారు.

 The Other Side Of Gopi Chand Life ,  Gopi Chand,  T.krishna , Tollywood, Prem Ch-TeluguStop.com

ఆయన వ్యక్తిత్వం ఏంటో అయన తీసిన సినిమాలను బట్టి కూడా కొత్త అర్ధం చేసుకోవచ్చు.అయన అకాల మరణం అయన కొడుకులకు కొంత శాపమని చెప్పాలి.

కృష్ణ గారు బ్రతికి ఉంటె అయన ఇద్దరు కోడలు ఒకరు గొప్ప దర్శకుడిగా మరొకరు గొప్ప హీరోగా ఎదగడం అయన చూసేవారు.కృష్ణ గారి ఆకస్మిక మరణం ఆ కుటుంబానికి ఇంటి పెద్దను మాత్రమే కాదు ఎంతో మందికి భవిష్యత్తు లేకుండా చేసింది.

కేవలం ఏడూ సినిమాలు మాత్రం తీసిన ఆయన్ను ఇంకా ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంది అంటే అయన ఎలాంటి ఆణిముత్యాల్ని తీశారో మనం అర్ధం చేసుకోవచ్చు.

సమాజం లో ఉందే సమస్యలను టి కృష్ణ గారు చూపించిన విధానం ఎంతో గొప్పగా ఉంటుంది.

ఇక అయన పెద్ద కొడుకు ప్రేమ్ చంద్ తండ్రి లాగ సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు.మొదటి సినిమా షూటింగ్ కూడా జరుగుతున్న సమయంలో 1995 కారు ప్రమాదంలో కన్ను మూసారు.

ఇలా ఇద్దరు మనుషులను కోల్పోయిన గోపి చాంద్ కుటుంబం కోలుకోవడానికి చాల టైం పట్టింది.అన్నాను కోల్పయిన గోపి చాంద్ ఆరేళ్లకు తొలిసారి తెరపైన హీరో గా నటించాడు.

హీరోగా, విలన్ గా తన నటనతో అందరిని ఆకట్టుకున్న గోపి చంద్ తన తండ్రి లాగానే గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి.చాల మంది సినీ ప్రేమికులకు అయన హీరోగా చేసిన సినిమాలకంటే కూడా విలన్ గా చేసిన జయం, నిజం, వర్షం సినిమాలు బాగా నచ్చుతాయి.

Telugu Chennai, Gopi Chand, Jayam, Nijam, Prem Chand, Krishna, Tollywood, Varsha

హీరో అయినా విలన్ అయినా గోపి చంద్ చక్కని హావభావాలను చూపెట్టగలడు.ఎంతో భయంకరమైన గెటప్ తో నిజం సినిమాలో బాగా నటించాడు.ఇక జయం చిత్రంలో రఘు క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది గోపి చంద్ కన్నా కూడా.ఇక వర్షన్ సినిమాకు వస్తే ఆ సినిమాలో బేస్ వాయిస్ తో గోపి చంద్ చెప్పే డైలాగ్స్ పాటు అయన అయన మొహం లో ఎక్సప్రెషన్స్ కూడా చాల చక్కగా ఉంటాయి.

ఖచ్చితంగా మళ్లి ఒక్కసారైనా విలన్ గా నటిస్తే చూడాలని అయన అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు.ఇక ఒక నటుడు విలన్ గా నటిస్తే విలన్ గానే కనిపిస్తాడు.

కానీ ఒక్క గోపి చంద్ మాత్రమే విలన్ గా నటించిన హీరోల కనిపిస్తాడు.ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మీరు చెన్నై లో కొంత మంది అనాథలను చేరదీసి వారికి ఫ్రీ గా విద్యను అందిస్తున్నారు కానీ ఎందుకు బయటకు చెప్పుకోరు అని యాంకర్ ప్రశ్నించగా మనం చేసే పనిలో మంచి కనబడాలి కానీ మనిషి కాదు అంటూ సింపుల్ గా చెప్పేసాడు.

ఎంతైనా ఆ తండ్రి కి పుట్టిన కొడుకు కదా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube