Hero Karti Sardar : సర్దార్ టీమ్ కి ఊహించని కానుకలు ఇచ్చిన హీరో కార్తీ!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సర్దార్.ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

 Hero Karti Gave Unexpected Gifts To Sardar Team , Hero Karti , Sardar Team , Sar-TeluguStop.com

ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదలయ్యే సుమారు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.ఇలా తెలుగు తమిళ భాషలలో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించి సందడి చేశారు.ఇందులో కార్తీ ఓ మాజీ రా ఏజెంట్ పాత్రలో నటించారు.

రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లైలా, రజిషా విజయన్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమా ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల వచ్చే తరానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనే కథాంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి హిట్ అయిన తర్వాత కార్తీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ప్లాస్టిక్ బాటిల్ వాడటం నిషేధించాలని భావించిన కూడా ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగిస్తూ ఉన్నారు.

దీంతో ఈయన చిత్ర బృందానికి సరికొత్తగా ఆలోచించి విభిన్న రీతిలో కానుకలు ఇచ్చారని తెలుస్తోంది.

Telugu Karti, Laila, Plastic Bottles, Ps Mitran, Rajisha Vijayan, Rashi Khanna,

సర్దార్ సినిమా కోసం పని చేసిన చిత్ర బృందానికి మొత్తం కార్తి 30000 రూపాయలు చొప్పున సిల్వర్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తీక్ తన తదుపరి సినిమా పనిలో నిమగ్నమయ్యారు.

పోన్నియన్ సెల్వన్ 1 ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న కార్తి త్వరలోనే పోన్నియన్ సెల్వన్ 2 పనులలో నిమగ్నమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube