సాధారణంగా కోటీశ్వరులు లేదా లక్షాధికారి కావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.అయితే, అంత ఈజీగా కోటీశ్వరులం కాలేమని అర్థం చేసుకోవాలి.
అయితే, కోటీశ్వరులు కావడానికి చాలా కాలం పాటు అనగా ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది.కానీ, ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.అదేంటీ? ఒక్క రాత్రిలో ఎలా కోటీశ్వరుడు అవుతాడు? అదెలా సాధ్యం.అవన్నీ ఉట్టి మాటలే అని మీరు అనుకుంటే పొరపడినట్లే.
నిజంగానే ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.ఎలాగో ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.
ఓ ఫ్రిజ్ కారణంగా అతడు మిలినీయర్ అయ్యాడు.అది కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫ్రిజ్ వల్ల.ఈ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది.పూర్తి వివరాల్లోకెళితే.
దక్షిణ కొరియాలోని జెజు ద్వీప నివాసి ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ ఆర్డర్ చేశాడు.అది ఇంటికి డెలివరీ అయింది.
ఇక ఆ ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తుండగా దిగువ భాగంలో ఓ అట్టముక్కకు టేప్ అతికించి ఉంది.దానిని గమనించిన సదరు వ్యక్తి దానిని తీయడంతో అందులో 1.30 లక్షల డాలర్ల ( ఇండియన్ మనీలో సుమారు 96 లక్షల రూపాయలు) విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి.ఈ క్రమంలోనే బెజు ద్వీప నివాసి పోలీసులకు కంప్లయింట్ కూడా చేశాడు.

ఫ్రిజ్ కింద దొరికిన నోట్ల కట్టలను పోలీసులకు అప్పజెప్పాడు.కాగా దక్షిణ కొరియా చట్టం ప్రకారం ఫ్రిజ్‌లోని ఆ డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే , ప్రభుత్వానికి 22 శాతం పన్ను చెల్లించి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు.అలా కాదని ఎవరైనా ముందుకు వస్తే కొంత డబ్బు అతడికి పరిహారం రూపంలో లభిస్తుంది.మొత్తంగా ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ ఆర్డర్ చేయడం వల్ల సదరు వ్యక్తికి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
అతడు నక్క తోక తొక్కాడని అనుకోవచ్చు.