హాట్‌టాపిక్‌గా మారిన కొత్త నోకియా ఫోన్.. అంత గొప్ప ఫీచర్లు ఏమున్నాయి ఇందులో..?

రీసెంట్‌గా HMD గ్లోబల్ కంపెనీ నోకియా X30 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్‌కమ్ చిప్‌సెట్ వంటి ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్లు చాలానే ఉన్నాయి.

 The New Nokia Phone Which Has Become A Hot Topic What Are The Great Features In-TeluguStop.com

అందుకే ప్రస్తుతం ఈ ఫోన్ టెక్ వర్గాల్లో ఆ టాపిక్‌గా మారింది.నోకియా X30 5G నోకియా ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్, అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ ధర రూ.48,999 కాగా ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది.నోకియా ఇండియా వెబ్‌సైట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2,799 విలువైన నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్, రూ.2,999 విలువైన 33W ఛార్జర్‌తో కూడిన బండిల్‌ను ఫ్రీగా పొందొచ్చు.

Telugu Flagshipnokia, Hmd, Nokia, Tech-Latest News - Telugu

మరోవైపు, అమెజాన్ ఇండియా నోకియా X30 5G ప్రతి కొనుగోలుతో 33W నోకియా ఫాస్ట్ వాల్ ఛార్జర్‌ను ఫ్రీగా అందిస్తోంది.ఇంకా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసేవారు రూ.2,000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందొచ్చు.నోకియా X30 5జీలో 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 695 5G ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ అయింది.

Telugu Flagshipnokia, Hmd, Nokia, Tech-Latest News - Telugu

దీనిలో వెనుక వైపు 50MP ప్యూర్ వ్యూ OIS కెమెరా, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఆఫర్ చేశారు.సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.యూఎస్‌బీ టైప్-సీతో వచ్చే దీని బ్యాటరీ సామర్థ్యం 4,200ఎంఏహెచ్.ఇది 33W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.మొత్తంమీద, నోకియా X30 5G ఆకట్టుకునే ఫీచర్లతో హాట్‌టాపిక్‌గా మారింది.నోకియా బ్రాండెడ్ క్వాలిటీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube