టాటా యాజమాన్యంలోని ఇండియన్ జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్, యునైటెడ్ స్టేట్స్‌లో తన మొదటి స్టోర్‌ను కొద్ది రోజుల క్రితం ప్రారంభించింది.ఈ కంపెనీ ఆ కొద్ది రోజుల్లోనే యూఎస్‌లో తనకు, ఇతర భారతీయ రిటైల్ బ్రాండ్‌లకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని తెలుసుకుంది.
యూఎస్‌లో అధిక ఇన్‌కమ్ వచ్చేవారు, భారతీయ సంస్కృతి, ఉత్పత్తులపై ఆసక్తి ఉన్న ఎన్నారైలు ఎక్కువగా ఉండటం వల్ల యూఎస్ ఇండియన్ కంపెనీలకు మంచి మార్కెట్ అవుతుందని తనిష్క్ తెలిపింది.అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించే ముందు, తనిష్క్ నార్త్ అమెరికన్ జ్యువెలరీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ రెండు సంవత్సరాలు గడిపింది.

మొదటి తనిష్క్ స్టోర్ న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్‌లో ఉంది, దీనిని లిటిల్ ఇండియా అని పిలుస్తారు.ప్రస్తుతం ఇది భారతీయ ప్రవాసుల మార్కెట్‌పై దృష్టి సారించింది.చికాగో వంటి ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.తనిష్క్ యూఎస్‌లో వినియోగదారుల మార్కెట్‌ను చేరుకోవడానికి మొదటి స్టోర్‌ను ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.కాగా తనిష్క్ స్టోర్ పుణ్యమా అని ఇండియన్ కంపెనీ నుంచి జ్యువెలరీ కొనుగోలు చేయాలనుకునే ప్రవాసులు ఇకపై ఇండియా రావాల్సిన అవసరం ఉండదు.

ఇకపోతే తనిష్క్ అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి భారతీయ రిటైల్ బ్రాండ్.భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు వివిధ వృత్తులలో కొనసాగుతూ అధిక ఆదాయం సంపాదించడం అనేది నిజం.నిజానికి ఎన్నారైల ఆదాయం సగటు అమెరికన్ కుటుంబానికి దాదాపు రెట్టింపు ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు.
అందువల్ల ఇక్కడ భారతీయ రిటైల్ బ్రాండ్స్ తమ స్టోర్లను ఓపెన్ చేస్తే కచ్చితంగా మంచి బిజినెస్ జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.







