ఓ పాకిస్థానీ సిటిజన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగిడి అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.యూట్యూబ్ ఛానల్ సనా అమ్జాద్ ఇంటర్వ్యూ చేయగా మోడీని ఆ సందర్భంగా పొగిడాడు.
వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఆ వ్యక్తి మోదీ నాయకత్వం పట్ల తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు.అంతే కాదు, భారత ప్రధానితో స్నేహం పాక్ పరిస్థితులను మెరుగుపరుస్తుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
మోదీని పాక్ పౌరుడిగా పొగిడినందుకు కొందరు తనను విమర్శించారని, అయితే తన అభిమానం నిజమేనని మళ్లీ ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో నొక్కి చెప్పాడు.

గత ఎనిమిదేళ్లలో మోదీ తన దేశాన్ని చక్కదిద్దారని, కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు.ఇంతకుముందు భారత్, పాకిస్థాన్‌లను పోల్చేవారని, ఇప్పుడు అసలు రెండు దేశాలకు పోలికే లేదన్నాడు.విదేశాల్లో కూడా భారత్ పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ సంబంధాల పట్ల మోదీ అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఈ పాక్ పౌరుడు మెచ్చుకున్నాడు.

అమెరికాకు కోపం తెప్పించే అవకాశం ఉన్నప్పటికీ, భారత పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అతని గొప్ప మనస్తత్వానికి నిదర్శనం అని అన్నాడు.ప్రజలకు మేలు చేయాలన్న మోదీ నిబద్ధతను ఇలాంటి నిర్ణయాలు తెలియజేస్తాయని సూచించాడు.పాకిస్థాన్‌కు అవసరమైన నాయకుడు మోదీ అని తాను నమ్ముతున్నానని పేర్కొన్నాడు.
ఈ పాకిస్థాన్ సిటిజన్ వీడియో రెండు దేశాల్లోనూ వైరల్‌గా మారింది.చాలా మంది మోదీని ఆ వ్యక్తి ప్రశంసించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.







