తమిళనాడులోని ఒక వృద్ధ బిచ్చగాడు తాను భిక్షగా సేకరించిన డబ్బులో సుమారు రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.పూల్పాండియన్ అనే ఈ బిచ్చగాడు మే 2020లో నిధికి తన మొదటి విరాళంగా రూ.10,000 చేసాడు.తర్వాత వివిధ జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయానికి మరో ఎనిమిది సార్లు వెళ్లి, ప్రతిసారీ రూ.10,000 విరాళంగా ఇచ్చాడు.72 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న పూలపాండియన్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లి భిక్షాటన ద్వారా డబ్బులు అందుకుంటున్నాడు.తనకు వచ్చిన డబ్బు మొత్తం తనకు అవసరం లేదని, తనకు కుటుంబం లేకపోవడంతో ఆ డబ్బును పేదలకు ఆదుకునేందుకు వినియోగిస్తున్నానని చెప్పాడు.

పూల్‌పాండియన్‌కు అతని భార్య, ఇద్దరు కుమారులతో కూడిన పెద్ద కుటుంబం ఉండేది.అతను 1980లలో ముంబైకి కుటుంబంతో సహా తరలిపోయాడు.అక్కడ అతను తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న ఉద్యోగాలు చేశాడు.
కానీ ఆ సంపాదన సరిపోక ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు.అతని భార్య సరస్వతి అనారోగ్యం పాలై 24 ఏళ్ల క్రితం మరణించింది.
దాంతో పూల్పాండియన్ తరువాత తమిళనాడుకు తిరిగి వచ్చి తన ఇద్దరు పిల్లలను పెంచాడు.పెద్ద పెరిగి పెద్దయిన తర్వాత పిల్లలు ఇతన్ని చూసుకోవడం మానేశారు.
దాంతో భిక్షాటన చేయటం మొదలుపెట్టాడు.

రోజులు గడిచేకొద్దీ, పూల్పాండియన్ తన అవసరాలను తగ్గించుకున్నాడు.అందుకు బదులుగా పాఠశాలలకు, కోవిడ్ -19 సహాయ నిధికి, శ్రీలంక తమిళులకు, ముఖ్యమంత్రి సహాయ నిధికి భిక్షాటన ద్వారా పొందిన డబ్బును డొనేట్ చేయడం ప్రారంభించాడు.2020లో, పూల్పాండియన్ తన దాతృత్వానికి గుర్తింపు పొందాడు.స్వాతంత్ర్య దినోత్సవం రోజున కోవిడ్-19 సహాయ నిధికి డబ్బులు అందించినందుకు మధురై జిల్లా కలెక్టర్ ఒక అవార్డును కూడా ఇచ్చారు.







