భూమి ఒక్కసారిగా కుంగిపోయి అందులో జంతువులు పడిపోవడం అనేది చాలా అరుదు. జోషిమఠ్ వంటి ప్రాంతాల్లో ఇవి జరగడం కామన్ కానీ తాజాగా దేశ రాజధాని ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది.
రీసెంట్ గా ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంత వాసులకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది.ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో భూమి లోపలకి కుంగిపోవడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డైంది.రోడ్డు కూలిపోయి రెండు బైక్‌లు, ఓ వీధికుక్క అందులో పడటం కనిపించింది.
అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రోడ్డు ఖాళీగా ఉన్నందున ఎలాంటి మానవ ప్రాణనష్టం జరగలేదు.

ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ఇప్పుడు రహదారిలోని ఇతర భాగాలను తనిఖీ చేస్తున్నారు.రోడ్డు ఇలా కుంగిపోవడానికి కారణం ప్రస్తుతం తెలియదు, అయితే ఇది భారీ వర్షాలు, పేలవమైన డ్రైనేజీ లేదా నేల కోత వల్ల సంభవించి ఉండవచ్చు.రోడ్డుపై ఇలాంటి కుంగుబాటులు ప్రమాదకరమైనవి.
ప్రజలకు, ఆస్తికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.అందువల్ల, ప్రజల భద్రతను కాపాడానికి అధికారులు రోడ్లు, మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా బాగు చేయడం చాలా ముఖ్యం.

భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రోడ్డు కుంగుబాటులకు గల కారణాలను అధికారులు పరిశోధించి పరిష్కరించడం చాలా కీలకం.ప్రముఖ వార్తా సంస్థ ANI తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో సీసీటీవీ ఫుటేజీని షేర్ చేసింది.ఈ వీడియోలో ఒక మూలలో 2 బైక్‌ల వద్ద రెస్ట్ తీసుకుంటున్న ఒక కుక్క కనిపించింది.దానితో పాటు ఒక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు.రెప్పపాటులో అతను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.కొన్ని సెకన్ల తర్వాత, మరొక వైపు కూలిపోవడంతో, రెండవ బైక్ కూడా లోపలికి పడిపోవడంతో గమనించవచ్చు.







