కేంద్ర ప‌థ‌కాల‌తో బ్యాంకుల అవ‌స‌రం పెరిగింది

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటికరణను కేంద్రప్రభుత్వం వేగవంతం చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఖాతాదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

నష్టాలు తగ్గించుకోవాలనే నెపం తో ఉద్యోగులపై పని భారం పెంచుతుంది.ప్రభుత్వ బ్యాంకుల నష్టాలకు కారణం బడా కార్పొరేట్ శక్తులు చెల్లించని అప్పులబకాయిలు తప్ప ఉద్యోగులు ఏ మాత్రం కాదు.2019-2022 సంవత్సరాల మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాపారం 34 లక్షల కోట్ల వరకు జరిగింది.కేంద్ర ప్రభుత్వం నూతన రుణ పథకాలు, మ్యూచువల్ ఫండ్, జీవిత భీమా, ఆరోగ్య భీమా, పంటల భీమా, పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టడంతో, 46 కోట్ల కొత్త సేవింగ్ ఖాతాలు తెరవబడినాయి.

ఆధార్ కార్డులకు అనుసంధానం చేసి రూపే ఎటియం కార్డుల పంపిణీ చేయడం జరిగింది.పి.ఎమ్ జీవన్ సురక్ష, పి.యం జీవన్ జీవన్ జ్యోతి భీమా పథకం, అటల్ పెన్షన్ పథకం, వేతనాలు, పెన్షన్, స్కాలర్ షిప్ లు అన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా జరుగుతున్నవి.భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రపంచంలోనే అతి ఎక్కువ మందికి సేవలు అందిస్తున్నాయి.156 కోట్ల సేవింగ్ ఖాతాలు, 11 కోట్ల రుణ ఖాతాలు కలిగిఉన్నవి.ఈ మూడు సంవత్సర కాలంలో చాలా మంది మరణించడం,రాజీనామాలు,స్వచ్చంద విరమణ తో ఖాళీ అయిన స్థానం లో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టక పోవడం తో ఉన్న ఉద్యోగుల పై పని భారం పెరిగి వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

బ్యాంక్ పని వేళల్లో ఖాతా దారులు నగదు ఉపసంహరణకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేక, ఇంటర్నెట్ సిగ్నల్స్ లో అంతరాయం ఏర్పడటంతో కౌంటర్లు మూసి వేయడం, పాస్ పుస్తకాలు ముద్రించలేక పోవడంతో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం లేని వారు బ్యాంక్ శాఖలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.గత మూడేళ్ళలో బ్యాంకుల విలీనాల వల్ల దాదాపు 3700 బ్యాంక్ శాఖలు మూతపడ్డాయి.

ఇప్పుడు బ్యాంక్ శాఖలకు ప్రత్యామ్నాయంగా "బ్యాంక్ మిత్ర"లు తెరచి కిరాణా, మందుల, పుస్తక వ్యాపారం నిర్వహిస్తున్నవారిని బ్యాంక్ ఏజెంట్లుగానియమించబడ్డారు.ఈ ఏజెంట్లకు తక్కువ మోతాదులో నగదు లావా దేవిలకు పరిమితం చేయబడింది.

ఎటియం, నెట్ బ్యాంక్, మొబైల్ ఆప్ ద్వారా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నందువల్ల బ్యాంక్ శాఖల అవసరం తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు