కడప జిల్లా బద్వేల్లో బాలుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది.బాలుడు అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇందులో భాగంగా చిన్నారిని హత్య చేసి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు.అయితే భార్యే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని బాలుని తండ్రి మారుతి నాయక్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
వివాహేతర సంబంధంతో నాలుగేళ్ల బిడ్డను చంపేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈక్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను చంపి పెరట్లో పాతిపెట్టినట్లు గుర్తించారు.
మరోవైపు బిడ్డ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తల్లి చెబుతోంది.ప్రియుడే హత్య చేశాడని ఆరోపిస్తుంది.