ఒకే రకమైన పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపిస్తేనే అధిక దిగుబడును సాధించి ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జించవచ్చు. రైతులు( Farmers ) కూడా ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు ముందుకు రాలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే మెక్సికోకు చెందిన అవకాడో పంట( Avocado Cultivation )ను ప్రస్తుతం భారతదేశంలో కొందరు రైతులు పండించి అధిక దిగుబడి సాధిస్తున్నారు.
అవకాడో లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సాగు అవుతున్న అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలే ఆహారంగా తింటున్నారు.ఈ అవకాడో పండు చూడటానికి పియర్ పండు మాదిరిగా ఉండి గుడ్డు ఆకారంలో కనిపిస్తుంది.
ఈ పండులో కేవలం ఒకే ఒక విత్తనం ఉంటుంది.
ఈ అవకాడో చెట్టు దాదాపుగా 67 అడుగుల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు ఆకులు సుమారుగా 25 సెంటీమీటర్ల పొడవు, పది మిల్లీమీటర్ల వెడల్పు తో ఉంటాయి.చెట్టు పువ్వు 8 అంగుళాల పొడవు పెరుగుతుంది.
ప్రపంచంలో ఉండే అన్ని శీతోష్ణ ప్రాంతాల్లో ఈ పంటను పండించి అధిక దిగుబడి సాధించవచ్చు.ఈ అవకాడో పంట సాగు విస్తీర్ణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
ఈ పంట సాగుకు సారవంతమైన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.సాగు చేపట్టిన ఆరు సంవత్సరాలకు పంట కూతకు వస్తుంది.పండ్లు చెట్టుపై ఉన్నప్పుడే మగ్గుతాయి.ఈ పంటను ఇతర దేశాలకు వాణిజ్యం చేయాలంటే.కాస్త పచ్చిగా ఉన్నప్పుడే కోసి భద్ర పరుస్తారు.ఈ పంటను సాగు చేయాలి అనుకునేవారు వ్యవసాయ క్షేత్రం నిపుణుల( Farm experts ) సలహాలను అడిగి తెలుసుకుని సాగు చేయాల్సి ఉంటుంది.