యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో సరికొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!

వండర్ ప్లస్ ఈవెంట్లో యాపిల్ వాచ్ అల్ట్రా 2( Apple Watch Ultra 2 ) ను కంపెనీ లాంచ్ చేసింది.

ఈ సరికొత్త వాచ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్ ప్ ను అందించనుంది.

ఇక లో చార్జింగ్ మోడ్ లో అయితే 72 గంటల వరకు ఉపయోగించవచ్చు.యాపిల్ కంపెనీ( Apple Company ) లాంచ్ చేసిన వాచ్ లలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వాచ్ యాపిల్ వాచ్ అల్ట్రా 2.సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఈ వాచ్ సేల్ ప్రారంభం కానుంది.ఈ వాచ్ ధర 799 డాలర్లు గా ఉంది.మన భారత కరెన్సీలో రూ.64000.అయితే భారతదేశంలో ఈ వాచ్ ధర రూ.89900 గా నిర్ణయించారు.

ఈ వాచ్ స్పెసిఫికేషన్లో విషయానికి వస్తే.3000 నిట్స్ బ్రైట్నెస్ డిస్ప్లే( 3000 nits brightness display ) తో వస్తుంది.ఈ వాచ్ బాడీను టైటానియంతో రూపొందించారు.

ఇందులో కంపెనీ కస్టమ్ ఎస్9 ఎస్ఐపీ చిప్ సెట్ ను అందించారు.ఈ వాచ్ లో ఆన్ డివైస్ సిరి ప్రాసెసింగ్, మెరుగైన లొకేషన్ ట్రాకింగ్ ఉన్నాయి.

Advertisement

వాచ్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ వాచ్ పనిచేస్తుంది.ఈ వాచ్ ను యూజర్లు డిస్ప్లే టచ్ చేయకుండానే ఒక చేత్తో వాచ్ ను కంట్రోల్ చేయవచ్చు.

కొండలు ఎక్కేవారు హైకింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ వాచ్ లో ఆల్టిట్యూడ్ రేంజ్ ను సముద్రమట్టం కంటే 500 మీటర్ల కిందకు 9,000 మీటర్లు పైకి అందించారు.వాటర్ స్పోర్ట్స్ ఆడే వారి కోసం 40 మీటర్ల వరకు డ్రైవింగ్ డెప్త్ కూడా ఉంది.

యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో మాడ్యులర్ అల్ట్రా అనే కొత్త ఫేస్ ను అందించారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు