జగన్‌కు ఇది తొలి ఓటమి.. తేల్చిన ది హిందూ సర్వే!

జగన్‌ అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు అవుతోంది.ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది.

అన్నీ కక్షపూరితంగా తీసుకున్న తప్పుడు, రివర్స్‌ నిర్ణయాలే.పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, అమరావతి నిర్మాణం ఆగిపోవడం, ఇసుక కొరత, ఇంగ్లిష్‌ మీడియం, మీడియాపై ఆంక్షల జీవోలాంటివన్నీ విమర్శల పాలయ్యాయి.

తాజాగా ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి పూర్తిగా నవ్వుల పాలయ్యారు.జాతీయ స్థాయిలో జగన్‌ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఈ నిర్ణయంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా పరుషమైన పదజాలంతో విమర్శలు గుప్పించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ది హిందూ పత్రిక నిర్వహించిన సర్వేలోనూ జగన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది.ఈ సర్వే ఫలితాలు కచ్చితంగా జగన్‌కు తొలి ఓటమే అని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

Advertisement

ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న జగన్‌ నిర్ణయం తెలివైనదేనా అని ది హిందూ పత్రిక తన వెబ్‌సైట్‌లో ఓ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది.ఈ వార్త రాసే సమయానికి లక్షన్నరకుపైగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.

ఇందులో జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్లు సుమారు 90 శాతం వరకు ఉండటం విశేషం.కేవలం పది శాతం మంది మాత్రమే ఆయన తీసుకున్నది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనా వ్యవస్థలను మూడు ముక్కలు చేసి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు పంచాలన్న ఆలోచనపై మొదటి నుంచీ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

అమరావతిలో రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తీవ్రమైన ఆందోళనలు చేపడుతున్నారు.అటు కర్నూలుకు హైకోర్టు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా వచ్చే లాభమేంటన్న విమర్శలూ ఉన్నాయి.

ఇటు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అంత ఆసక్తి చూపడం లేదు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు