గంగోత్రి సినిమాలో నటించాల్సిన హీరో బన్నీ కాదా.. మరెవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా హిట్ అయ్యాయి.ఇలా అల్లు అర్జున్ ప్రతి ఏడాది తన గ్రాఫ్ పెంచుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

The Hero Should Act In The Movie Gangotri Is Not Bunny Who Else ,movie Gangotri

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో మొదట హీరో ఛాయిస్ అల్లు అర్జున్ కాదట.ఈ విషయం గురించి నాగబాబు స్వయంగా వెల్లడించాడు.ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు గంగోత్రి సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ.

Advertisement
The Hero Should Act In The Movie Gangotri Is Not Bunny Who Else ,movie Gangotri

గంగోత్రి సినిమాలో హీరోగా నటించడానికి మొదట రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చిందనీ,అయితే చిరంజీవి వల్ల అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లోకి వచ్చాడని తెలిపారు.రామ్ చరణ్ కి గంగోత్రి సినిమా హీరోగా ఆఫర్ వచ్చినప్పుడు.

చరణ్ హీరోగా అరంగేట్రం చేయడానికి అప్పటికీ చాలా చిన్నవాడని చిరు భావించారనీ, దీంతో చిరంజీవి ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ను రిఫర్ చేశాడని నాగబాబు వెల్లడించాడు.

The Hero Should Act In The Movie Gangotri Is Not Bunny Who Else ,movie Gangotri

గంగోత్రి సినిమా అవకాశం వచ్చినప్పుడు చరణ్ కి సినిమాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే చిరంజీవి అలా చేశారని నాగబాబు తెలియజేశారు.ఇదిలా ఉండగా గంగోత్రి సినిమా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు.ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా చిరుత సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.చరణ్ నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన చరణ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు