అరియనాకు ఐ లవ్యూ చెప్తూనే ఆ మాట అనేసిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ పరిచయమే.బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.

 The Guy Said That While Saying I Love You Ariyana Do You Know What Happened , Ar-TeluguStop.com

పైగా ప్రస్తుతం ప్రసారమవుతున్న నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.

ఇక తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

కేవలం ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Ariyana, Bigg Boss, Telugu, Tollywood-Movie

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.

ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.అంతే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవాళ్ళు.

దాంతో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.అరియానా ప్రస్తుతం వరుస షో లతో బాగా బిజీగా ఉంటుంది.

గత ఏడాది బిగ్బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Ariyana, Bigg Boss, Telugu, Tollywood-Movie

ఇక ఓటీటీలో ప్రసారమవుతున్న నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈమె కూడా మొదట్లో అందరికీ బాగా నచ్చింది.కానీ నాన్ స్టాప్ లో ఉన్నంత కాలం ఈమె ప్రవర్తన ఎవరికి నచ్చ లేదు.

కారణం ఆమె ప్రతిదానికి చాలా ఓవర్ గా చేసిందని.ప్రతి ఒక్కరి తో కావాలని గొడవ పడుతుందని ప్రేక్షకుల ఆమెకు సరిగ్గా ఓట్లు కూడా వేయలేకపోయారు.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది అరియానా.ఇక ఓవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది.

తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.అందులో ఓ నెటిజన్ అరియానా ఐ లవ్ యు.నువ్వంటే నాకు చాలా ఇష్టం.నీ కోతి వాయిస్ బాగుంటుంది అని అనటంతో వెంటనే దానికి స్మైల్ తో స్పందించింది అరియానా.

ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube