సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల గురించి ఏదైనా వార్త వస్తే చాలు వెంటనే అది హాట్ టాపిక్ గా మారుతుంది.ఎందుకంటే వారి మధ్య జరిగే సంఘటనలు అలా ఉంటాయి కాబట్టి.
ఇప్పటికే ఎంతోమంది నటీనటుల రహస్యాలు బయటపడి అందరి దృష్టిలో పడ్డాయి.ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నటుల బంధంపై కూడా కొన్ని నిజాలు బయటపడ్డాయి.
ఇంతకు ఆ నటులు ఎవరో కాదు.పవిత్ర, నరేష్.
వీరిద్దరూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటి నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే గత కొంతకాలం నుండి వీరి మధ్య ఏదో సంబంధం ఉందని బాగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
వీరు పెళ్లి చేసుకుంటారు అని కూడా గతంలో వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైన కూడా వాళ్లు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.
ఇక వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్లడం లాంటివి చేయడంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు అని అనుకున్నారు ప్రజలు.కానీ ఇటీవలే ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో నటి పవిత్ర కొన్ని విషయాలు బయట పెట్టింది.
కర్ణాటక చెందిన ఓ కన్నడ న్యూస్ ఛానల్ తాజాగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.అందులో నరేష్ పై ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించడంతో.అది నిజమే అని తెలిపింది.కానీ అది తన వ్యక్తిగత విషయం అని.దానిపై ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు అని తెలిపింది.పైగా తాను, నరేష్ కలిసి ఉంటున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కూడా తెలుసని.
వారికే అభ్యంతరం లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకని ప్రశ్నించింది.
నిజానికి ఈ స్టింగ్ ఆపరేషన్ ను నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి విడాకుల కేసు విషయంలో కొన్ని నిజాలు తెలుసుకోవటానికి ఏర్పాటు చేశారు.రమ్య కూడా మీడియా ముందు విషయాలు బయట పెట్టింది.నరేష్ మోసం చేశాడు అని.దూరంగా ఉన్నా కూడా విడాకులు తీసుకోలేదు అని.అయినా మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ప్రశ్నించింది.ఇక పవిత్ర కూడా తనపై రమ్య కావాలని బ్యాడ్ చేస్తుంది అని ఓ వీడియో ద్వారా తెలిపింది.అంతే కాకుండా తాజాగా నరేష్, జంట మైసూర్ లో హోటల్ లో ఉండగా అక్కడికి నరేష్ మూడో భార్య రమ్య వచ్చి పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది.
దాంతో పోలీసులు అడ్డుకోవటంతో వారిని లిఫ్ట్ లోకి తీసుకెళ్లారు.అంతేకాకుండా నరేష్ తన భార్యను రమ్యను చూసి విజిల్ వేస్తూ కనిపించాడు.దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ విషయం గురించి బాగా హాట్ టాపిక్ గా నడుస్తుంది.