మనం ఒకటి అనుకుంటే విధి ఒకటి తలుస్తుంది అని అంటూ ఉంటారు.అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న తరుణంలో మృత్యువు ఏదో ఒక రూపంలో వచ్చి కబలిస్తూ ఉంటుంది కొన్నిసార్లు.
తాజాగా ఇక్కడ ఐదుగురు బాలికల విషయంలో ఇలాంటిదే జరిగింది.బట్టలు ఉతికేందుకు చెరువుకు వచ్చిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డారు ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని జాల్నా జిల్లా తలెగాంవాడి గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు గ్రామంలోని సమీప చెరువుకు వెళ్లారు.ఈ క్రమంలోనే ఓ బాలిక ప్రమాదవశాత్తు నీట మునిగింది.
ఆ బాలికను కాపాడే క్రమంలో మరో బాలిక…తర్వాత ఇంకొ బాలిక.ఇలా వరుసగా ఐదుగురు బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
అయితే అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి పరుగున వచ్చి ఆ ఐదుగురు బాలికలను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.
ఆ అయిదుగురు బాలికలు ప్రాణాలు వదిలారు.
ఇక బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతుళ్లు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇక ఒకేసారి ఐదుగురు బాలికల చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.