కేసీఆర్ రాజకీయ చాణక్యం ఎంతటిదో మనకు తెలిసిందే.అందుకే కదా ఎన్నో ఏళ్లుగా రకరకాల సందర్బంలో ఉద్యమాలు చేసినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేక పోయారు.
కాని కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రకాల వర్గాలను ఏకం చేసి నడిపిన చరిత్ర కేసీఆర్ కు సొంతం.తన రాజకీయ జీవితంలో రాజకీయంగా ఎన్నో రకాల ఉడుదొడుకులను ఎదుర్కొన్న కేసీఆర్ కు తెలంగాణ సాధించుకున్నాక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు వచ్చే పరిస్థితులు ఏంటి అని అనేది కేసీఆర్ కు తెలియనిది కాదు.
అందుకే తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసాక కేసీఆర్ చేసిన మొట్టమొదటి ఎత్తుగడ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం.
అందులో భాగంగా తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడం.
అందుకే ముందుగా టీడీపీలోని ముఖ్య నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి మంత్రి పదవులు కట్టబెట్టడం, కొంత మందికి ఇతరత్రా పదవులు ఇవ్వడం లాంటి వాటి ద్వారా టీడీపీని సంస్థాగతంగా బలహీన పరిచి ప్రజల్లో టీడీపీ పట్ల నమ్మకం కోల్పోయేలా చేసాడు.అందులో కేసీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
తాజాగా టీడీపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ లో చేరి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసారు.దీంతో తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలన్న కేసీఆర్ కల నెరవేరిందని చెప్పుకోవచ్చు.