రెండోసారి సీఎం అయిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం..!!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు మరికొంతమంది కేంద్ర మంత్రులు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు.తనతోపాటు క్యాబినెట్ మంత్రులతో 52 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ క్రమంలో రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నిన్న రెండు గంటల వరకు క్యాబినెట్ భేటీ నిర్వహించారు.అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి నిర్ణయం గా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో మూడు నెలల్లో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 30వ తారీకు వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 15 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

మామూలుగా అయితే ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ పథకాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ యూపీ బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు