విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు నేటితో ముగియనున్న గడువు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు గడువు నేటితో ముగియనుంది.

బిడ్ వేసుందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది.

ఇప్పటివరకు బిడ్డింగ్ లో 22 కంపెనీలు పాల్గొనగా అందులో ఆరు విదేశీ సంస్థలు, పదహారు దేశీయ సంస్థలు ఉన్నాయి.అయితే సింగరేణి సంస్థ బిడ్ వేస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

మరోవైపు ప్రైవేట్ కంపెనీలను అనుమతించవద్దని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.ప్రభుత్వ సంస్థలే విశాఖ స్టీల్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అటు బ్లాస్ట్ ఫర్నేస్ -3ని రన్నింగ్ లో పెట్టెందుకు ఆర్ఐఎన్ఎల్ ప్రయత్నాలు చేస్తుంది.ఈ మేరకు ముడి పదార్థాలు ఇస్తే స్టీల్ ఇస్తామని ప్రకటించింది.ఇందులో భాగంగానే రూ.5 వేల కోట్ల మూలధనం సమకూర్చే కంపెనీలకు ఆహ్వానం పలికింది.దీంతో ముడి పదార్థాలు ఇస్తామని, మూల ధనం సమకూరుస్తామని 22 కంపెనీలు బిడ్లు వేశాయి.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు