ఇకపై సిలిండర్ వారికి మాత్రం రేషన్ షాప్ లోనే..?!

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడడం సర్వ సాధారణం అయిపోయింది.

ఇకపోతే సడన్ గా ఇంట్లో గ్యాస్ సిలిండర్ కాకముందే మరో సిలిండర్ బుక్ చేసుకుంటాం.

కానీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అవ్వడానికి ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది.అయితే ఇలాంటి సమయాలలో చిన్న సిలిండర్లు అందుకు సహాయపడతాయి.

చిన్న సిలిండర్లను ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టాయి.సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు 19 కిలోలు , డొమెస్టిక్ సిలిండర్లు 14.2 కిలోల కెపాసిటీతో లభిస్తే ఈ చిన్న సిలిండర్ ను మాత్రం కేవలం ఐదు కిలోల కెపాసిటీతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.చిన్న సిలిండర్లు అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ వినియోగించుకునే వారికి వలస కార్మికులకు చాలా సహాయపడతాయి.

అయితే తాజాగా ఈ చిన్న సిలిండర్లను రేషన్ షాపుల్లో అమ్మకాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.భారత్ పెట్రోలియం కంపెనీ వారు మినీ పేరుతో, ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు చోటు అనే పేరుతో, హిందుస్థాన్ పెట్రోలియం వారు అప్పు అనే పేరుతో ఈ చిన్న సిలిండర్లను రేషన్ షాప్ ద్వారా అమ్ముతున్నాయి.

Advertisement

అయితే ఈ చిన్న సిలిండర్లు ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్లు కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు.అలాగే ఈ చిన్న సిలిండర్లను కొనుక్కోవడానికి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఐడి ప్రూఫ్ ద్వారానే ఈ సిలిండర్లను సులువుగా కొనుక్కోవచ్చు.

ఈ సందర్భంగా ఈ చిన్న సిలిండర్లను ఇకపై రేషన్ షాప్ ద్వారా అమ్మకాలు జరిపే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తున్నట్లు ఫుడ్ సెక్రెటరీ సుధాంశు పాండే తెలియజేశారు.అయితే భారతదేశం మొత్తంగా 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నట్లు ఈ షాపుల ద్వారా 20 కోట్ల మంది ప్రజలు లబ్ది చేకూరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.ఇక రేషన్ షాప్ ద్వారా కేవలం చిన్న సిలిండర్లు అవ్వడంతో పాటు రుణాలు కూడా అందించడానికి, అలాగే ఆర్థిక సేవలన్నీ కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

చూడలిమరి ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో.

చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!
Advertisement

తాజా వార్తలు