రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ ( Congress )తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకోవాలని చూస్తోంది.
మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదల కాంగ్రెస్ లో కనిపిస్తోంది.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా బిజెపి ( BJP )ప్రభావం కనిపించేలా అనేక వ్యూహరచన లు చేస్తుంది.దీనికి ధీటుగా నే కాంగ్రెస్ కూడా బిజెపి పై పై చేయి సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వచ్చే లోకసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా సీరియస్ గానే దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను పోటీకి దింపితే గెలుపునకు డొఖా ఉండదని లెక్కలు వేసుకుంటోంది .దీనిలో భాగంగానే ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో( AICC office ) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మొదటి విడత అభ్యర్థుల ఎంపికలో భాగంగా కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులను ప్రకటించింది .దీంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది .దీనిలో భాగంగానే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ కమిటీ భేటీ కానుంది .ఈ సందర్భంగా లోక్ సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.

ఏపీ, కర్ణాటక , తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , హర్యానా , తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మొదటి విడత అభ్యర్థుల ఎంపికలో భాగంగా తెలంగాణకు నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు.తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ రాష్ట్రం లోని ఎంపీ సీట్ల కు భారీ గా డిమాండ్ ఏర్పడింది.పార్టీ సీనియర్లు, వారి వారసులు ఇలా అంతా ఎంపీ టికెట్లపై భారీగా అశలు పెట్టుకున్నారు.