కరోనా కట్టడిలో ఎన్నెన్నో లొసుగులు ? ఇక ఆపేదెలా ? 

గత ఏడాదితో పోల్చి చూసుకుంటే,  ఇప్పుడు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.గతేడాదితో పోలిస్తే మరణాల రేటు రెట్టింపు అయ్యింది.

సరిగ్గా గత ఏడాది ఇదే రోజు దేశమంతా లాక్ డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలయ్యాయి.ఇక శానిటైజర్ లు, సోషల్ డిస్టెన్స్, కరోనా కట్టడికి తీసుకున్న నియమ నిబంధనలు ఇలా ఎన్నో సమర్థవంతంగా పని చేశాయి.

జనాలలోను కరోనా భయం ఎక్కువగా కనిపించింది.అయితే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కారణంగా వలస కూలీల తో పాటు,  చాలా మంది ఇబ్బందులు పడినా,  కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు మరో మార్గం లేదని జనాలు నమ్మారు.

అత్యవసర సేవలు మినహా,  ఇక వేటినీ అనుమతించకపోవడంతో,  ఈ వైరస్ వ్యాప్తి అప్పట్లో కాస్త కంట్రోల్ లోకి వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

మరణాలు తీవ్రంగా ఉన్నాయి.దీనికి తోడు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత, పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయకపోవడం, సినిమా హాళ్లు, బార్లు, భారీగా జనం గుమిగూడేవన్నీ తెరుచుకోవడం,  కేవలం నైట్ కర్ఫ్యూ తో సరి పెట్టడంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నా, ఆ సమయంలో రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటుంది.పగటిపూట మాత్రం భారీ జన సందోహం ఉంటారు.

ఇక గతంతో పోలిస్తే ఈ వైరస్ మహమ్మారి మరింత బలం పుంజుకుందని, గాలిలోనూ ఈ వైరస్ మూడు గంటల పాటు ఉంటుందనే వార్తలు జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.గతం కంటే ఇప్పుడు ఈ వైరస్ తీవ్రత రెట్టింపు అయ్యిందని , ప్రభుత్వాలకు తెలిసినా,  ఆ స్థాయిలో నిబంధనలు అమలు చేయకపోవడంతో మళ్ళీ జనాలు తగిన మూల్యం చెల్లించు కుంటున్నారు.

జనాల్లో ను ఈ వైరస్ పై గత ఏడాది ఉన్నంత భయం ఇప్పుడు లేకపోవడం,  రోడ్లపైకి వస్తూ గుంపులుగా తి,  సాధారణ మాస్కులతో సరిపెట్టడం,  శానిటైజర్ లు పెద్దగా వినియోగించుకోవడం, వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది అన్నట్లుగా నిర్లక్ష్యం వహించడం,  ఇలా ఎన్నెన్నో ఈ వైరస్ ఉదృత కి కారణం అవుతున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇక కేంద్రం సైతం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నట్టు గా అర్థం అవుతోంది.వైరస్ తీవ్రత ను ముందుగా అంచనా వేయకపోవడం,  వ్యాక్సిన్లు దేశ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండకుండా, విదేశాలకు ఎగుమతి చేసి, ఇక్కడ కొరత ఏర్పడడంతో మళ్లీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం,  ఇప్పుడు ఆక్సిజన్ కొరత కారణంగా వేలాది మంది మృతి చెందుతుండడం, ఇప్పుడు ప్లాంట్ల నిర్మాణం పై దృష్టి పెట్టినా,  కొన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు బయటకు వస్తున్నాయి.ఇక ఇప్పుడు ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ లో కొంత భాగం విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారనే విమర్శలు కేంద్రం ఎదుర్కొంటోంది.

Advertisement

ఈ కరోనా ఉధృతి విషయంలో కేంద్రంపై రాష్ట్రాలు,  రాష్ట్రాలపై కేంద్రం విమర్శలు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు తప్ప,  సీరియస్ గా ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోకపోవడమూ ఎన్నో అనర్థాలకు కారణం అవుతున్నాయి.

తాజా వార్తలు