కిర్లంపూడి మండలం బూరుగుపూడి విలేజ్ శివారులో NH-16 హైవేపై కలగా వీర బ్రహ్మానందం పామాయిల్ తోటల వద్ద పోలీసులు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వీ సురేష్ బాబు కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ జి అప్పలరాజుకు రాబడినా ముందస్తు సమాచారం మేరకు అన్నవరం వైపు నుండి వస్తున్న ఒక ప్యాసింజర్ ఆటో AP27TW9294 మరియు దానిలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది సదరు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు దేవుడు ఫొటోలతో ఉన్న ఐదు చెక్క పెట్టెలో గంజాయి ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్న మొత్తం 1222.7కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది.
1 5 చక్క పెట్టెలతో గంజాయి బరువు 122.7kg ,ఒక ప్యాసింజర్ ఆటో నగదు ముప్పై వేలు నగదు మొబైల్ ఫోన్ ప్రాపర్టీస్ ను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు .దేవుని ఫోటోలతో వినూత్న రీతిలో గంజాయి రవాణా చేస్తున్న విశాఖపట్నం ఏరియాకు చెందిన ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు వారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తున్నట్టు డీఎస్పీ తెలియజేశారు.
ఇదే తరహా పనిని చాలా రోజుల నుంచి చేస్తు చట్టం నుంచి తప్పించుకుంటున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సిఐ సురేష్ బాబుని ఎస్ఐ అప్పల్రాజుని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు