ఏపీలో పొత్తుల సందడి ! ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న జగన్ ?

ఏపీలో( AP )పొత్తుల రాజకీయం జోరందుకుంది.

ఏపీ అధికార పార్టీ వైసీపీని ( YCP )ఓడించడమే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు వ్యూహాలు పన్నుతూ పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తుంది.

టిడిపి తో పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగా, బిజెపి మాత్రం ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. టిడిపి మహానాడు( TDP Mahanadu ) రేపటి నుంచి మొదలుకాబోతోంది.

ఈ మహానాడులో అనేక నిర్ణయాలను పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించనున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నామనే విషయాన్ని ప్రకటించేందుకు బాబు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఏపీ అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అవుతుంది.

ఈ మేరకు నేడు జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.రేపు ఢిల్లీలో జరగబోయే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు.

Advertisement

అనంతరం బిజెపి పెద్దలను కలిసి ఏపీ రాజకీయ అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీలో చోటు చేసుకున్న రాజకీయంతో పాటు, జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లే దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.నీతి అయోగ్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith shah ) తో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోను జగన్ సమావేశం అవుతారు .కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సాయం పైన జగన్ చర్చించబోతున్నారట.అలాగే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం గురించి జాతీయస్థాయిలో ప్రధాని మోదీని విపక్ష పార్టీలు టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో జగన్ కేంద్రానికి మద్దతుగా నిలవడం, దానికి ప్రధాని అభినందనలు తెలపడం జరిగింది.

రాజకీయ విభేదాలు అన్నిటిని పక్కనపెట్టి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని జగన్ సైతం పిలుపునిచ్చారు.రాష్ట్రంలో బిజెపి వైసిపి ప్రభుత్వంకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తుండడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి .ఇక ప్రస్తుతం జనసేన ,టిడిపి ల రాజకీయం పైన జగన్ బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించి, రానున్న రోజుల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే విషయం పైన బీజేపీ కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చించబోతున్నారట.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు