వైరల్ వీడియో: వారిపై అమానుషంగా దాడి చేసిన ఎద్దు..!

ఎద్దులు, బర్రెలు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.ఒక్కోసారి ఇవి ఘోరంగా మనుషులను కుమ్మేస్తాయి.

అయితే తాజాగా జరిగిన ఒక సంఘటనలో అంతకు మించి అనేలా ఒక ఎద్దు సైకిల్ రైడర్ పై భయంకరమైన దాడికి పాల్పడింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ జరుగుతోంది.

ఈ రేస్ లో పాల్గొన్న ముగ్గురు రైడర్లలో ఒకరిపై ఒక ఎద్దు దారుణంగా దాడి చేసింది.ఈ దాడిలో ఆ రైడర్ చాలా ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు.

Advertisement

అంతటితో ఆగకుండా ఈ ఎద్దు అతడిపై మరొకసారి దాడి చేయడానికి ప్రయత్నించింది.అయితే అతడు వెంటనే అప్రమత్తమై ఆ ఎద్దు నుంచి తప్పించుకొని పరుగుతీశాడు.

ఇది ఇతరులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది.దీంతో వాళ్లు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని ది రాక్ కోబ్లర్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు ఎద్దుకి సమీపంగా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.బ్లాక్ బుల్ గివ్స్ యు వింగ్స్ అని కొంతమంది ఫన్నీ గా కామెంట్లు పెడుతున్నారు.అయితే సైకిల్ రైడర్ అనవసరంగా దానికి చాలా సమీపంగా వెళ్లాడని, అది అతడి తప్పేనని నెటిజనులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
ఇజ్రాయెలీ మ్యూజియంలో పురాతన కూజాను పగలగొట్టిన బాలుడు, వారిచ్చిన ట్విస్ట్‌తో..?

మరికొంతమంది మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.ఏది ఏమైనా అదృష్టంకొద్దీ ఆ రైడర్ స్వల్ప గాయాలతో ఎద్దు దాడి నుంచి బయట పడ్డాడు.గతంలో కూడా ఆవుల దాడులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందర్నీ షాక్ కు గురిచేశాయి.

Advertisement

అయితే ఇప్పుడు అమెరికాలో కూడా ఎద్దు దాడులు జరుగుతున్నాయని తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన వీడియోతో తెలిసొచ్చింది.ఈ లేటెస్ట్ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తాజా వార్తలు